ఓటరు జాబితాలో తప్పులు ఉండొద్దు !

by Shyam |   ( Updated:2020-11-09 09:58:25.0  )
ఓటరు జాబితాలో తప్పులు ఉండొద్దు !
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు డిప్యూటీ కమిషనర్లు అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి తెలిపారు. సోమవారం ఏంఎయూడీ సమావేశ మందిరంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నోడల్ అధికారులు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. త్వరలోనే పోలింగ్ కేంద్రాలను ప్రచురించేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తామని, సాధ్యమైనంత వరకు గత ఎన్నికల్లో కేటాయించిన పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని అలా ఉంటే ఓటర్లకు సులభమవుతుందని సూచించారు.

ఈ నెల 13న ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పులు లేకుండా చూడాలని, ఏ ఓటరు కూడా పోలింగ్ రోజున ఇబ్బంది పడకుండా జాబితా ఉండాలన్నారు. ఓటర్లు, అభ్యర్థులకు సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 24గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్‌లను వెంటనే ఏర్పాటు చేయాలని, ఆ ఫోన్ నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని, డీఆర్‌సీ సెంటర్ల వద్ద అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. కొవిడ్ వ్యాప్తి చెందకుండా నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని పార్థసారధి ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed