స్థానిక ఎన్నికల పరిశీలకులుగా వీరే…!

by srinivas |
స్థానిక ఎన్నికల పరిశీలకులుగా వీరే…!
X

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు వేగంపుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎన్నికల పరిశీలకులను సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. 13 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటు నలుగురు ఉన్నతాధికారులను కూడా పరిశీలకులుగా నియమించింది.

కర్నూలు జిల్లాకు కె.ఆర్.బి.హెచ్.ఎన్. చక్రవర్తి. కృష్ణ జిల్లాకు పద్మ, తూర్పు గోదావరి జిల్లాకు పి.ఉషాకుమారి, విజయనగరం జిల్లాకు పీ.ఏ. శోభ, అనంతపురం జిల్లాకు కె హర్షవర్థన్, చిత్తూరు జిల్లాకు టి బాబూరావు నాయుడు, శ్రీకాకుళం జిల్లాకు ఎం రామారావు, ప్రకాశం జిల్లాకు కే శారదాదేవి, విశాఖపట్నం జిల్లాకు ప్రవీణ్ కుమార్, నెల్లూరు జిల్లాకు బి రామారావు, కడప జిల్లాకు పి రంజిత్ బాషా, గుంటూరు జిల్లాకు కాంతిలాల్ దండే, పశ్చిమ గోదావరి జిల్లాకు హిమాన్షు శుక్లాను నియమించారు.

వీరిలో ఎవరైనా ఇతర సమస్యల కారణంగా అందుబాటులో లేని పక్షంలో వారికి అదనంగా నలుగురు సీనియర్ ఉన్నతాధికారులు సీహెచ్. శ్రీధర్, జి. రేఖ రాణి, టి.కె.రామమణి, ఎన్.ప్రభాకర్ రెడ్డిలను రిజర్వులో ఉంచింది.

Tags: election comission, vijayawada, ap, local body elections

Advertisement

Next Story