DMHO Jobs: గుంటూరు జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్, ఆపరేటర్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-20 13:35:38.0  )
DMHO Jobs: గుంటూరు జిల్లాలో  ల్యాబ్ టెక్నీషియన్, ఆపరేటర్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి గుంటూరు(Guntur) జిల్లాలోని అర్బన్ క్లినిక్/యూపీహెచ్ సీల్లో(Urban Clinic/ UPHC) ల్యాబ్ టెక్నీషియన్, ఆపరేటర్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారిని అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగంలోకి తీసుకుంటారు. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 30వ తేదీ లోపు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు:

  • ల్యాబ్ టెక్నీషియన్(Lab Technician) : 03 పోస్టులు
  • శానిటరీ అటెండెంట్(Sanitary Attendant) : 11 పోస్టులు
  • డేటా ఎంట్రీ ఆపరేటర్(Data Entry Operator) : 11 పోస్టులు
  • ఫార్మసిస్ట్(Pharmacist) : 15 పోస్టులు

విద్యార్హత:

పోస్టును బట్టి 10th క్లాస్, పీజీడీసీఏ, డీఫార్మసీ/బీఫార్మసీ/ఎంఫార్మసీ, బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 1 సెప్టెంబర్ 2024 నాటికి 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ:

రాతపరీక్ష, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు :

అన్ రిజర్వ్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 300, ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులకు రూ. 100 ఫీజు ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed