డీఈఈసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

by GSrikanth |
డీఈఈసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈఐఈడీ), డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌(డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్ దరఖాస్తు గడుడును పొడిగించారు. ఈ మేరకు డీఈఈసెట్ కన్వీనర్ ఎస్ శ్రీనివాసచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ డైట్‌ కాలేజీతో పాటు, ప్రైవేట్‌ కాలేజీల్లో ప్రవేశాలు క‌ల్పించ‌నున్నారు. కాగా, గతంలో మే 22వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు విధించారు. ప్రస్తుతం అదనంగా మరో రెండ్రోజులు అప్లికేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. డీఈఈసెట్‌ ఎగ్జామ్‌ను జూన్‌ 1న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇతర వివరాల కోసం http://deecet.cdse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Next Story

Most Viewed