ఏపీ పీజీఈసెట్ - 2023 షెడ్యూల్ రిలీజ్

by Javid Pasha |
ఏపీ పీజీఈసెట్ - 2023 షెడ్యూల్ రిలీజ్
X

దిశ, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 2023 విద్యా సంవత్సరానికి గాను ఏపీ పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు వివిధ పీజీ కోర్సుల్లో మొదటి ఏడాది ప్రవేశాలు కల్పిస్తారు.

ఎంట్రెన్స్ పరీక్ష వివరాలు:

ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023

పీజీకోర్సులు: ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్ డీ.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్/బీఫార్మసీ ఉత్తీర్ణత పొందిన/చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.

గేట్/జీప్యాట్ అర్హత సాధించిన అభ్యర్థులకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

ఎంపిక: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ. 1200, బీసీ అభ్యర్థులు రూ. 900, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 700 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు: మార్చి 21, 2023 నుంచి ప్రారంభం.

చివరితేది: ఏప్రిల్ 30, 2023 వరకు.

లేటు ఫీజుతో చివరితేది: మే 14, 2023.

పీజీఈసెట్ పరీక్షతేది: మే 28, 2023 నుంచి మే 30, 2023.

వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in


Advertisement

Next Story

Most Viewed