ఏపీ డా.బీఆర్ అంబేద్కర్ గురుకుల బీఆర్ఏజీ సెట్ - 2023

by Harish |
ఏపీ డా.బీఆర్ అంబేద్కర్ గురుకుల బీఆర్ఏజీ సెట్ - 2023
X

దిశ, ఎడ్యుకేషన్: తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2023 - 2024 విద్యా సంవత్సరానికి గాను ఐదో తరగతి (ఆంగ్ల మాధ్యమం) ప్రవేశాలకు సంబంధించి బీఆర్ఏజీ సెట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది.

ఎగ్జామ్ వివరాలు:

డా.బిఆర్ అంబేద్కర్ గురుకులం బీఆర్ఏజీ సెట్ 2023 (5వ తరగతి ప్రవేశాలు)

సీట్లు: 189 గురుకులాల్లో మొత్తం సీట్ల సంఖ్య : 14,940

అర్హత: 2021-22 లో 3వ తరగతి, 2022-23 లో 4వ తరగతి చదివి ఉండాలి. విద్యార్థులు తమ సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం లక్షకు మించరాదు.

వయసు: ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులు 1-9-2010 నుంచి ఆగస్టు 31, 2014 మధ్య; ఓసీ, బీసీ, బీసీ సి విద్యార్థులు 1.9.2012 నుంచి 31.9.2014 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మార్చి 24, 2023.

ప్రవేశ పరీక్ష తేదీ: ఏప్రిల్ 24, 2023.

వెబ్‌సైట్: https://apgpcet.apcfss.in

Advertisement

Next Story