- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అందువల్లే విద్యా రుణాలు పెరిగాయి: సీఆర్ఐఎఫ్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా చాలావరకు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్ తరగతులను నిర్వహించాయి. దీంతో దేశీయంగా 2020లో విద్యా రుణాల డిమాండ్ భారీగా పెరిగాయి. ప్రముఖ క్రెడిట్ బ్యూరో సంస్థ సీఆర్ఐఎఫ్ సేకరించిన వివరాల ప్రకారం..బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు గతేడాది సెప్టెంబర్ నాటికి 12 నెలల కాలంలో రూ. 11 వేల కోట్ల రుణాలను పంపిణీ చేశాయి. అదేవిధంగా 2020లో మార్చి నుంచి అక్టోబర్ మధ్య మహమ్మారి సమయంలో 3 లక్షల మందికిపైగా కొత్త రుణాలకు దరఖాస్తులు చేసుకున్నారు.
కరోనా తర్వాత ప్రజలు ఎక్కువగా మెరుగైన కోర్సుల ద్వారా నైపుణ్యం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ట్రేడ్ కన్సలెంట్లు అభిప్రాయపడ్డారు. వీటిలో ఎక్కువగా షార్ట్‌టర్మ్ స్కిల్ ప్రోగ్రామ్‌ల కోసం లోన్‌లకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ‘ విదేశీ కోర్సుల కోసం దరఖాస్తులు చేసుకునేవారు వార్షిక ప్రాతిపదికన 35 శాతం పెరిగారని ఎడ్యువాంజ్ ఫైనాన్షింగ్ సీఈవో వరుణ్ చోప్రా వివరించారు. గతేడాది కరోనా ప్రభావం కారణంగా గృహావసరాల రుణాలతో పాటు ఎడ్యుకేషన్ లోన్‌లు కూడా భారీగా పెరిగాయి. మొత్తంగా రుణ డిమాండ్ పెరిగిందని వరుణ్ చోప్రా తెలిపారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో చిన్న సైజు రుణాలకు మరింత డిమాండ్ ఉంటుందని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.