- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జైలుకు వెళ్లే... బీఆర్ఎస్ లీడర్ ఎవరు?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ దూకుడు పెంచిందా? ప్రస్తుతం తెలంగాణలోని హై ఓల్టేజ్ రాజకీయ పరిస్థితులు చూస్తే అట్లానే అనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణలతో హడావుడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తరువాత కాస్త స్లో మోషన్‌లో పడిపోయిందని అందరు అనుకున్నారు, కానీ మెల్లిమెల్లిగా ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీ వ్యూహంతోనే ముందుకు సాగారని ఇప్పుడు అర్థమవుతోంది.
ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంతో పాటు పార్టీ కేడర్ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఏం చేస్తా రో చేసుకోండి.. భయపడేది లేదంటూ ప్రభుత్వ ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొట్టిపారేస్తున్నప్పటికి బీఆర్ఎస్ నేతల్లో మాత్రం తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల లెక్క తేల్చే పనిలో పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య స్కామ్‌లు, కేసులు అంటూ ఎత్తుకు పైఎత్తు రాజకీయాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్‌ను కార్నర్ చేసేందుకు ఇటు కాంగ్రెస్ పార్టీ... అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు గులాబీ పార్టీ, మీరు తప్పులు చేశారంటే..మీరు స్కామ్‌లు చేస్తున్నారంటూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసు కుంటూ..చలి కాలంలో హీట్ పెంచుతున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి విచారణతో పాటు ధరణి పోర్టల్, విద్యుత్ కొనుగోలులో గోల్‌మాల్ వ్యవహారాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మరోవైపు హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వ హించిన ఫార్ములా కారు రేసులోనూ భారీ ఎత్తు న అక్రమాలు జరిగాయని విమర్శలు వచ్చాయి. ఈ కేసుల్లో విచారణ ఫైనల్ స్టేజికి వచ్చింది. ఈ అవినీతి కేసుల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు మరికొందరి అధికారుల ప్రమే యం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో వారిపై క్రిమినల్ కేసులు పక్కాగా నమోదయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే గత ప్రభుత్వ పెద్దల అరెస్టులు కాంట్రాక్టు సంస్థలకు చిక్కులు తప్పేలా లేవు. ఈ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌లలో ఎవరో ఒకరు ముందుగా అరెస్టు అయ్యే అవ కాశం ఉందన్న చర్చ బీఆర్‌ఎస్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
ముందుగా అరెస్టు చేసేదెవరిని?
గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో తొలిసారిగా ఫార్ములా ఈ-రేసింగ్ నిర్వహించారు. అయితే ప్రమోటర్‌గా బాధ్యత తీసుకున్న ఒక కంపెనీ డబ్బులు చెల్లించడానికి వెనుకాడటంతో హెచ్ఎండీఏ తన ఖజానా నుంచి రూ. 55 కోట్లను ఎలాంటి అనుమతులూ లేకుండా, చట్టవిరుద్ధంగా చెల్లించారని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తున్నది. అయితే, ఈ-రేసింగ్ నిర్వహించే వేదికల జాబితాలో హైదరాబాద్ పేరు లేకపోతే దాని గురించి ప్రాసెస్ చేయమని అధికారి అర వింద్ కుమార్‌కు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చా నని ఆ యనే ఫైల్ పంపితే నేను సంతకం పెట్టా నని, ఇందులో తన తప్పేమీ లేదు. మంత్రిగా అది నా బాధ్యత, హెచ్‌ఎండీఏ స్వతంత్ర ప్రతిపత్తి గల బో ర్డు హెచ్‌ఎండీఏ నిధుల వినియోగానికి కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదు” అంటూ ప్రెస్ మీట్లు పెట్టీ మరీ చెప్పుతుండటం తో, తన అరెస్ట్ ఖాయమనే ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్లు అతను చేస్తున్న హడావుడీ తెలియజేస్తోంది.
గవర్నర్ అనుమతి ఎందుకు?
ఐతే ఇప్పటి వరకు కేటీఆర్ అరెస్ట్ అనుమతి కోసం మాత్రమే గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్‌లో ఉందన్న విషయం అందరికి తెలిసిందే. మరో వైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డిపై ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి తన బావమరిది సృజన్ రెడ్డికి చెందిన శోధా కంపెనీకి రూ.1,137 కోట్ల విలువైన అమృత్ స్కీమ్ టెండర్లను కట్టబెట్టారని, వాటి ద్వారా పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. అయితే, ఈ రేసింగ్‌లో అవకతవకలు జరిగాయని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతున్నపుడు విచారణ కోసం గవర్నర్ అను మతి ఎందుకంటే..? అవినీతి నిరోధక శాఖ చట్టం లోని సెక్షన్ 17-ఎ ప్రకారం.. ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ తన విధి నిర్వహణలో భాగంగా అవినీతికి పాల్పడినట్లుగా, అధికారం దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలు వచ్చినా, ఏ పోలీసు అధికారి కూడా అధీకృత వ్యక్తుల లేదా వ్యవస్థల అనుమతి లేకుండా విచారించడానికి వీలు లేదు. ఆ నిబంధనల ప్రకారం చూస్తే, ప్రస్తుత లేదా మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలని చట్టం చెబుతోంది.
అనుమతి లేకుండా అరెస్టు చేయలేమా?
గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా (పబ్లిక్ సర్వెంట్) ఉన్నప్పుడు విధి నిర్వహణలో అవతకవలకు పాల్పడినట్లు, పబ్లిక్ సర్వెంట్ అనే ప్రాతిపదికన తెలంగాణ సర్కార్ గవర్నర్ అనుమతిని కోరుతున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఐపిసి సెక్షన్ 21 వర్తించదు. ముఖ్యంగా విధి నిర్వహణలో భాగంగా లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాం డెడ్‌గా పట్టుబడినా లేదా లంచం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో పోలీసులు పట్టుకున్నపుడు ఈ సెక్షన్ ఎంత మాత్రం వర్తించదు. అధికార దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడిన కేసుల్లో తప్ప, ఇతర ఏ కేసుల్లోనైనా ఎమ్మెల్యే, ఎంపీలు, సీఎం, పీఎంలను కూడా ముందస్తు అనుమతి లేకుండా విచారించవచ్చు. కేవలం రాష్ట్రపతికి, గవర్నర్‌కు మాత్రమే దీన్నుంచి మినహాయింపు ఉంది. ఇతర కేసుల్లో కేసు నమోదు చేసి ఆ ఎమ్మెల్యేను నిరభ్యంతరంగా పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చు. ఒకవేళ ఆ సమయం లో అసెంబ్లీ సమావేశాలు నడుస్తుంటే మాత్రం స్పీకర్ అనుమతితో ఆయనను అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది.
-డాక్టర్. బి. కేశవులు. ఎండి. సైకియాట్రీ
చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం
85010 61659