- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం!
ఎవరు ఏ పార్టీకి ఎంత విరాళాన్నైనా అనామకంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ బాండ్ల ద్వారా విరాళాలు ఇచ్చే వారి వివరాలు, డబ్బు స.హ చట్టం ద్వారా కూడా దొరకవు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ పథకం రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సీపీఐ(యమ్-యల్) లిబరేషన్ స్వాగతిస్తుంది. ఎలక్టోరల్ బాండ్‌లు ప్రజాస్వామ్య, రాజ్యాంగ విరుద్ధమైనవి. రాజ్యాంగ విరుద్ధమైన ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా జరిగిన కార్పొరేట్ నిధుల వివరాలను ప్రజల ముందుంచడానికి, కార్పొరేట్ శక్తులకు, ఈ పథకం ప్రధాన లబ్దిదారు బీజేపీకి మధ్య ఉన్న అపవిత్ర సయోధ్యను బహిర్గత పరచేలా ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించాలని కోరుతున్నాం.
పాలకులను ప్రజలే శిక్షించాలి
2017 నుండి, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ విరాళాలలో సింహభాగాన్ని స్వీకరించిన బీజేపీనే ఈ పథకం ప్రధాన లబ్ధిదారు. ఈ ప్రయోజనం పొందేందుకు, ఎలక్టోరల్ బాండ్‌లు నల్లధనం , ఎన్నికల అవినీతికి ఆజ్యం పోస్తాయనే ఆర్‌బిఐ, ఎన్నికల కమిషన్ హెచ్చరికలను కూడా మోడీ పాలన తోసిపుచ్చింది. ఎలక్టోరల్ బాండ్‌లు భారీ ఎన్నికల అవినీతికి, రాజ్యాంగ తప్పుదోవ పట్టించడానికి, ప్రజాస్వామ్యాన్ని క్షీణింపజేయడానికి తిరుగులేని సాధనంగా మారాయి. రాజ్యాంగ విరుద్ధమైన ఈ పథకాన్ని ప్రయోగించిన పాలకులను ఇప్పుడు ప్రజలే శిక్షించాలి. భారతదేశ ప్రజలు, 2024లో జరగబోయే ఎన్నికలలో కార్పొరేట్-మద్దతుతో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అక్రమంగా నిధులు సమకూర్చుకొన్న పాలకులను ఓడించాలి.
- దీపాంకర్ భట్టాచార్య
ప్రధాన కార్యదర్శి,
సీపీఐ (యమ్-యల్) లిబరేషన్