- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓటరన్నా.. చూసి ఓటేయ్
బలిదానాలు ఇది కొందరికి నచ్చని ముచ్చటే కావచ్చు. ఇవి కథలు కావు.. పాటలు కావు.. తెలంగాణ అమరవీరుల చరిత్రలు.. పోరాట చరితలు.. మాకు ఏ విధమైన గుర్తింపు అవసరం లేదు. కానీ తమ బలిదానాలతో మన జీవితాన్ని నిలబెట్టిన తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఇప్పుడు ఇందు కోసమేనా మేము ఆత్మ బలిదానం చేసుకుందని క్షోభ పడుతున్నాయి.
ఎవరి దయ వల్ల రాలేదు..
ఓ ఓటరూ.. మా ఆశయం మీ ఓటుతో బతికించాలి. మా అమరుల రక్తం మీలో ప్రవహించేలా తెలంగాణ అభివృద్ధినీ కోరుకోండి... మా ఊపిరి మీ ఓటులో చూసి ఓటు వేయండి ...నేనూ మీ తెలంగాణ తొలి అమరుడిని శ్రీకాంత్ చారిని.. నా నెత్తుటి మడుగుని చూసి తెలంగాణ నిరుద్యోగుల కోసం ఓటు వేయి... నేనూ పోలీస్ కిష్టయ్యని, నా తలలో ఎలా బుల్లెట్ దూసుకుపోయిందో అలానే ఈ తెలంగాణ రాష్ట్రం బాగు కోసం ఓటు వేయి... నేనూ వేణుగోపాల్ రెడ్డిని కాలే నిప్పుతో పోరాటం చేసి అమరుడినయ్యా.. నా త్యాగాన్ని నీ ఓటుతో గుర్తించు... నేనూ చాజు నాయక్ నీ నిండు నిప్పుతో జై తెలంగాణ అన్నాను కానీ అయ్య అవ్వ అనలే ఓటు వేసే ముందు నా ప్రాణం ఎలా పోయిందో నేను ఎంత వర్ణనాతీతంగా బాధ భరించి అమరుడిని అయ్యానో చూసి ఓటు వేయి. నేను మీ సుమన్‌ని.. ఎదురు వచ్చే ట్రైన్‌కి ఎదురు వెళ్లి తెలంగాణ రాష్ట్రం కోసం మీ కోసం ప్రాణాలు కోల్పోయినా... నేనూ మీ సురేష్ నాయక్‌ని, పురుగుల మందు అమృతంలా తాగి నడి రోడ్డు పైన పడి విలవిల అంటూ మీ జీవితం కోసం ప్రాణాలు కోల్పోయినా… నేనూ మీ ఆడ బిడ్డని, నా అన్నలు అక్కలు తల్లులు అందరూ బాగుండాలని, పాలమూరు జిల్లాకు కరువు కాటకాలు ఉండవని నమ్మి, కిరోసిన్ పోసుకుని ఆ నిప్పుతో సజీవ దహనం అయినా స్వర్ణ అక్కని ...కానీ ఇప్పుడు మీరు వేసే ఓటు మీ తలరాతను మార్చాలి.. నేను మీ సిరిపురం యాదయ్యని ఉస్మానియా యూనివర్సిటీ గేట్‌లో కాలిపోయిన వీరుడిని...
ఓటర్ అన్నా మేము 1200 వందల మంది అమరవీరులం. మా ఆశయ సాధన కోసం ఓటు వేసి తెలంగాణ రాష్ట్రం బాగుండాలి అని కోరుకోండి... తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారిని మృతులుగా భావించకండి. మేము ఎవరికీ లేని ఇది మాకెందుకు అనుకోలేదు తెలంగాణ కోసం మంటలో కాలిపోయినం, ఉరితాళ్లకు ఉయ్యాల ఊగినం, విషాన్ని మింగింనం,ట్రైన్‌కి ఎదురు పోయినం.. మా చివరి మాట జై తెలంగాణ.. చివరి శ్వాస జై తెలంగాణ.. చివరి ఆశ జై తెలంగాణ.. ఓటు చూసి వేయి.. ఎందుకంటే ఇది త్యాగాల తెలంగాణ. ఇది 1200 మంది రక్తంతో సాక పోసి తెచ్చినా తెలంగాణ .. ఇది ఎవరి దయ వల్ల వచ్చినా తెలంగాణ కాదు.. 1200 మంది అమరవీరుల రక్తపు బొట్టు పెట్టి తెచ్చినా తెలంగాణ. ఓటర్ అన్నా జర చూసి ఓటేయి..
నరేష్ నాయక్ జరుపుల
తెలంగాణ అమరవీరుల కుటుంబాల
హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు
85005 85982