ఆ ఖాళీలనూ డీఎస్సీలో కలపాలి.. రావుల రామ్మోహన్ రెడ్డి

by Shiva |   ( Updated:2024-06-19 00:00:55.0  )
ఆ ఖాళీలనూ డీఎస్సీలో కలపాలి..  రావుల రామ్మోహన్ రెడ్డి
X

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ప్రక్రియ ద్వారా ఏర్పడే 9 వేల ఉపాధ్యాయ ఖాళీలు ప్రస్తుతం ఉన్న డీఎస్సీ నోటిఫికేషన్‌లో జత చేసి లక్షలాది మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే మెగా డీఎస్సీ ద్వారా 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున డీఎస్సీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం. గత ప్రభుత్వం జారీ చేసిన 5089 టీచర్ పోస్టులకు కొత్త ప్రభుత్వం మరో 6 వేల టీచర్ పోస్టులు మాత్రమే జత చేసి 11,062 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. గత 8 సంవత్సరాలుగా టీచర్ పోస్టులు భర్తీ కాలేదు.33 జిల్లాల వారీగా చూస్తే ఇప్పుడు వచ్చిన డీఎస్సీలో స్వల్ప సంఖ్య లోనే పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే సింగిల్ డిజిట్ లోనే ఖాళీలు ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులు కూడా చాలా జిల్లాల్లో తక్కువ సంఖ్యలోనే ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పుడు చేపట్టిన టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ప్రక్రియ ద్వారా 9 వేల కొత్త ఖాళీలు ఏర్పడనున్నాయి. కావున ఈ ఖాళీలు కూడా ప్రస్తుత డీఎస్సీలో జత చేసి లక్షలాది మంది అభ్యర్థులకు న్యాయం చేయాలి. అప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేద విద్యార్థులకు కూడా టీచర్లు అందుబాటులొ ఉంటారు. ప్రభుత్వ స్కూల్స్ కూడా బలోపేతం అవుతాయి. టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత హేతుబద్ధీకరణ అంటూ టీచర్ పోస్టులు కుదించకుండ మొత్తం ఖాళీలు ప్రస్తుత డీఎస్సీలోనే కలిపి అందరికీ న్యాయం చేయాలి. అలాగే డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించాలి.

రావుల రామ్మోహన్ రెడ్డి

రాష్ట్ర అధ్యక్షులు

తెలంగాణ డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం

Advertisement

Next Story

Most Viewed