- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అమెరికాలో తెలుగు విద్యార్థులూ జాగ్రత్త!

భారతదేశం నుండి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుండి అమెరికాకు వెళ్లినటువంటి స్టూడెం ట్స్‌కి ఒక ముఖ్యమైన సూచన ప్రస్తుతం ఎఫ్-1 వీసా మీద ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా మీరు పార్ట్ టైం కోసం బయట గ్యాస్ స్టేషన్లో లేదా మోటల్(లాడ్జ్)లో లేదా ఇంకెక్కడైనా పనిచేస్తున్న వాళ్లు మరీ ముఖ్యంగా రెస్టారెంట్లు, సబ్వెలు... యూనివర్సిటీ క్యాంపస్ బయట ఇటువంటి వాటిలలో పని చేసుకునే మన తెలుగు విద్యార్థులు ఎవరైనా ఒక నెల రోజులు ఓపికగా ఉండండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. మీకు ఆన్‌లైన్ క్యాంపస్‌లో గనుక ఎస్.ఎస్.ఎన్ (SSN) వచ్చి ఉంటే వారానికి 20 గంటలు సంతోషంగా పని చేసుకోండి. అంతేకానీ బయట ఎటువంటి చోట కూడా మీరు పనికి వెళ్లకండి. మరీ ముఖ్యంగా మీరు ఒక యూనివర్సిటీ వీసా పైన స్టాంపింగ్ అయ్యి అమెరికా వెళ్లిన తర్వాత యూనివర్సిటీ కనుక మారి ఉంటే మీరు కచ్చితంగా నెల నుండి రెండు నెలలు చాలా జాగ్రత్తగా ఉండండి.
అంతేకాకుండా మీరు ఇంతకుముందు ఉన్న చోటు నుండి ఇంకొక చోటికి వెళ్లి అక్కడ మీరు నమ్మిన స్నేహితులతో ప్రొటెక్షన్ తీసుకొని ఉండండి. ఎందుకంటే మీరు యూనివర్సిటీ మారినట్టుగా మీ మిత్రులలో మీరు పార్ట్ టైం చేస్తున్నట్టుగా ఆ పార్ట్ టైం చేసే పరిసరాలలో కొంతమందికి తెలిసి ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో మీకు కొంత థ్రెట్ ఉంటుంది. మీకు తెలిసిన వాళ్లు మీ పైన ఏదైనా కక్షతో కనుక ఉంటే దానివల్ల మీకు ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకని మీరు ప్రస్తుతం ఉంటున్న చోటు నుండి సేఫ్టీ ప్లేస్‌లోకి మారడం అన్ని విధాలుగా మీకు ఉపయుక్తంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆన్‌లైన్ యూనివర్సిటీలో చదువుకునే పిల్లలు మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి.
OPTలో ఉన్న విద్యార్థులు కూడా మీరూ జాగ్రత్తగా ఉండండి. దయచేసి తల్లిదండ్రులు కూడా మీరు మీ పిల్లలు పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు పూర్తిగా తెలుసుకుంటూ.. వారికి జాగ్రత్తగా వివరించి చెబుతూ వారికి సహకరించాలని విజ్ఞప్తి.
- గట్ల రవీందర్
81870 15745