- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొహర్రం పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా!
హసన్, హుస్సేన్ అనే ముస్లిం వీరుల స్మారకార్థం శోక తప్త హృదయాలతో జరుపుకునే కార్యక్రమమే మొహర్రం. ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో దీనిని జరుపుకుంటారు. పది రోజుల పాటు జరిగే కార్యక్రమాలలో ఇస్లాంకు సంబంధించిన ప్రవచనాలు, మహ్మద్ ప్రవక్త బోధనలు వినిపిస్తాయి. హిజ్రీ శకం ప్రకారం ముహర్రమ్‌ను మొదటి నెలగా పరిగణిస్తారు. చంద్రుడి కళల ఆధారంగా ఈ మాసానికీ, ఈ మాసంలోని పదవ రోజుకూ చాలా ప్రాముఖ్యం ఉంది. ఆ రోజును 'ఆఘారా'అంటారు.
అఘారా గురించి ఎంతో మంది మహనీయులు ఎన్నో విషయాలు తెలియజేశారు.మొహర్రం నెల పదో రోజున పీర్లను ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సమయంలో పెద్దఎత్తున హజ్రత్ ఇమాం హుస్సేన్‌కు గుర్తుగా పంజా ప్రతిమలను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు. మొహర్రం అనేది వాస్తవానికి పండగ కాదు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం తొలి మాసాన్ని మొహర్రం నెలగా పిలుస్తారు. అయితే ఈ నెలలోని పదో రోజుకు ఓ ప్రత్యేకత ఉంది.
ఆయన ప్రతిపాదనలు తోసిపుచ్చి
మహ్మద్ ప్రవక్త ధర్మం కోసం అన్యాయాలను, అక్రమాలను నిరసించారు. పాలితులు ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని, జనమంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. మహమ్మద్ ప్రవక్త మరణానంతరం హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్, హజ్రత్ అలీ, హజ్రత్ ఉమర్ సైతం సుపరిపాలన అందించారు. అయితే, వీరి తర్వాత వచ్చిన మావియా చక్రవర్తి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. అనంతరం యజీద్ తనను తాను ఖలీఫాగా ప్రకటించుకుని రాక్షస పాలన సాగించాడు. చెడు అలవాట్లకు బానిసైన యజీద్ ప్రజల్ని పీక్కుతినడం ప్రారంభించాడు. దీంతో అతడి దురాగతాలను హజ్రత్ హుస్సేన్ ఎదురించి ప్రజల పక్షాన నిలిచాడు.
శాంతి కోసం హుస్సేన్ చేసిన ప్రతిపాదనలను యజీద్ తోసిపుచ్చి యుద్ధం ప్రకటించాడు.మొహర్రం నెల ఒకటో రోజున ఇరాక్‌లో కర్బలా మైదానంలో యుద్ధం ప్రారంభమైంది.ఈ యుద్ధంలో యజీద్ సైన్యం హుస్సేన్ తో పాటు అతని కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేసి మహిళలు,పసిపిల్లలను సైతం పాశవికంగా హతమార్చింది.మొహర్రం నెల 10వ రోజు సాయంత్రం నమాజ్ చేస్తున్న సమయంలో ఇమాం హుస్సేన్‌ను శత్రుసైన్యం చుట్టుముట్టింది. ప్రార్థనలో భాగంగా సజ్దా చేస్తున్న సమయంలో భూమిపై తల ఆన్చడంతో వెంటనే శత్రు సైన్యం హుస్సేన్ శిరస్సును ఖండించింది. హుస్సేన్ తలతో సైన్యం ఊరేగుతూ విజయోత్సవం జరుపుకుంటుంది.
అప్పటి సంప్రదాయం
శత్రువుల చేతిలో 70 మంది వరకు మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారు అమరులౌతారు. ఈ సందర్భంలో హజ్రత్ హుస్సేన్ ఆ తెగకు శాపం పెడతారు. ఈ తెగకు ఎప్పటికీ మోక్షం ఇవ్వొద్దని అల్లాహ్‌ను ప్రార్ధిస్తూ ప్రాణాలు విడుస్తాడు. యుద్ధానంతరం యజిద్ తెగకు చెందిన వారు పశ్చాత్తాపం చెంది ..దేవుడా మేం తప్పు చేశాం.. దైవ ప్రవక్త మహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారిని మా చేతులతో హతమర్చాం.. కాబట్టి మమ్మల్ని మన్నించమని గుండెల మీద చేతులతో బాదుకుంటూ బిగ్గరగా ఏడుస్తూ నిప్పులపై నడుస్తారు.
అప్పటి నుంచి ప్రారంభమైన సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.మరోవైపు మహమ్మద్ ప్రవక్త కుటుంబానికి చెందిన వ్యక్తులు అమరులైన సందర్భంగా వారికి సంతాపంగా అరబ్ వాసులు రెండు రోజుల పాటు ఉపవాస దీక్ష పాటిస్తారు. మొహర్రం నెలలోని 10, 11 రోజుల్లో ఉపవాస దీక్ష పాటించడాన్ని ముస్లింలు పవిత్రంగా భావిస్తారు. మొహర్రం నెలలో ముస్లింలు తమ ఇళ్లలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. ఇస్లాంను వ్యాపింపజేసేందుకు తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన హజ్రత్ ఇమాం హుస్సేన్ కు సంతాపం తెలిపే ఉద్దేశంతో దీన్ని పాటిస్తారు.
(నేడే మొహర్రం)
యాసర్ హుస్సేన్
90522 39669