ఉద్యమ ఆది గురువు కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి తెలుసా!

by Ravi |   ( Updated:2022-09-20 18:30:02.0  )
ఉద్యమ ఆది గురువు కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి తెలుసా!
X

దేశ స్వాతంత్ర్య పోరాటం, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక పోరాటం నుంచి తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమం వరకు క్రియాశీలక పాత్ర పోషించారు. 1947 డిసెంబర్ 4న నిజాం మీద బాంబులు విసిరిన నారాయణరావు, పవార్ బృందంలో కొండా లక్ష్మన్ కూడా నిందితుడే. అజ్ఞాతంలో ఉండి కూడా నిజాం నిరంకుశ పాలన మీద తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనమయ్యాక 1952లో ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. 1957లో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం దామోదర సంజీవయ్య కేబినెట్‌లో ఆబ్కారీ, చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. బ్రహ్మానంద‌రెడ్డి మంత్రివర్గంలో కార్మిక, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

భారత స్వాతంత్ర్య పోరాటంలో, ముల్కీ ఉద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక పోరాటంలో, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో ఆయనది కీలక పాత్ర. జీవితాంతం తెలంగాణ సమస్యలపై పోరాటం చేసిన తెలంగాణ పక్షపాతి దివంగత కొండ లక్ష్మణ్ బాపూజీ.

ఆయన జీవితం ఏకకాలంలో నాలుగు భిన్నమైన, అంతర్గత సంబంధం కలిగిన ప్రజా ఉద్యమాలతో ముడిపడి ఉండేది. అవి వరుసగా నిజాం వ్యతిరేక పోరాటం, వెనుకబడిన కులాల ఉద్యమం, చేనేత సహకారోద్యమం, ప్రత్యేక తెలంగాణోద్యమం.

నిజాంకు వ్యతిరేకంగా

కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్ర అమోఘం. తొలి దశ పోరాటంలో చురుకుగా వ్యవహరించడమే కాకుండా, మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా త్యజించిన త్యాగశీలి. తెలంగాణ ప్రజల కష్టాలు తీరాలంటే ప్రత్యేక రాష్ట్ర సాధన తప్ప వేరే మార్గం లేదని విశ్వసించారు. వివిధ మార్గాల ద్వారా పాలకులకు తన నిరసనను తెలియజేశారు. 1915 సెప్టెంబర్ 27న ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మించారు. లా చదివి న్యాయవాద వృత్తి చేపట్టారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వారి పక్షాన కేసులను వాదించి గెలిపించేవారు. దేశ స్వాతంత్ర్య పోరాటం, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక పోరాటం నుంచి తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమం వరకు క్రియాశీలక పాత్ర పోషించారు. 1947 డిసెంబర్ 4న నిజాం మీద బాంబులు విసిరిన నారాయణరావు, పవార్ బృందంలో కొండా లక్ష్మణ్ కూడా నిందితుడే.

అజ్ఞాతంలో ఉండి కూడా నిజాం నిరంకుశ పాలన మీద తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనమయ్యాక 1952లో ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. 1957లో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం దామోదర సంజీవయ్య కేబినెట్‌లో ఆబ్కారీ, చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. బ్రహ్మానంద‌రెడ్డి మంత్రివర్గంలో కార్మిక, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత సీఎం పదవి కోసం పోటీ పడినా దక్కలేదు. గవర్నర్‌గా అవకాశం ఇచ్చిన సున్నితంగా తిరస్కరించారు.

అవిశ్రాంత పోరాట యోధుడు

కాసు బ్రహ్మనంద రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా ఉంటూనే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఉద్యమ ఉధృతి కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామానే తెలంగాణ ఉద్యమాన్ని ఒక చారిత్రక మలుపు తిప్పింది. 1973లో పీవీ నరసింహారావు తదనంతరం బాపూజీకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దొరికింది. కానీ, నాటి హోమ్ మంత్రి ఉమా శంకర్ దీక్షిత్ పట్టుదల కారణంగా జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యారు. 1958లో బాపూజీ హుస్సేన్‌సాగర్ తీరాన భూమి కొనుక్కొని 'జలదృశ్యం' పేరిట బంగ్లాను నిర్మించుకున్నారు. 2002లో చంద్రబాబు ప్రభుత్వం దానిని నేలమట్టం చేయగా, కోర్టు ద్వారా అనుకూల తీర్పు పొందారు. 1952 ముల్కీ ఉద్యమంలోనూ ఆయన పాత్ర ఉంది.

తెలంగాణ కోసం 97 యేండ్ల వయసులో చలిని కూడా లెక్క చేయక ఢిల్లీలో దీక్ష చేశారు. 2000 సంవత్సరంలో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్‌ను ప్రోత్సహించడమే కాకుండా సెక్రెటేరియట్ ఎదురుగా ఉన్న తన 'జలదృశ్యం'ను టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయానికి ఇచ్చారు. అందులోనే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. బాపూజీ‌గా పిలువబడే కొండా లక్ష్మణ్ తన 97వ యేట 2012 సెప్టెంబర్ 21న మరణించారు. తన ఆస్తులను, జీవితాన్ని ధారబోసి, కొండంత వ్యక్తిత్వం, నిబద్ధత కలిగిన రాజకీయ ఆదర్శ నేతగా గుర్తింపు పొందారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చివరి శ్వాస వరకు చిత్తశుద్ధితో కృషి చేసి, మూడు తరాలకు వారధిగా నిలిచారు.

(నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి)


రామకిష్టయ్య సంగనభట్ల

94405 95494

Advertisement

Next Story