- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమరుల త్యాగాలకు గుర్తు
భారతదేశం సహా ప్రపంచంలోని పదిహేను దేశాలు తమ స్వాతంత్ర్య సమరయోధులకు గౌరవం ఇవ్వడానికి అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటాయి. భారతదేశం స్వేచ్ఛ, కీర్తి, సంక్షేమం పురోగతి కోసం పోరాడిన సమరయోధులను స్మరించుకోవానికి ప్రతి సంవత్సరం జనవరి 30, మార్చి 23న షహీద్ దివస్‌ను జరుపుకుంటాం.
నేడే షహీద్ దివస్ ఎందుకు?
మనం పోరాటాల నుంచి స్ఫూర్తిని పొందుతాం, భూత కాలపు పోరాటాల చరిత్రలే..భవిష్యత్తు పోరాటాల కు స్పూర్తి. మనం చరిత్ర నుంచి స్ఫూర్తి పొంది, చరిత్ర లిఖించిన పోరాటాలను ప్రేరణ పొంది వాటి బాటలోనే సాగుతాం. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో యావత్తు దేశాన్ని ముందుండి నడిపించాడు జాతిపిత మహాత్మా గాంధీ. భారత మాత బానిసత్వపు సంకెళ్లను బంధ విముక్తి చేయడానికి ఆ మహాత్ముడు ఎన్నో ప్రయాసలకు ఓర్చాడు. భారత దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మహాత్మా గాంధీ 1948 జనవరి 30న సాయంత్రం 517 నిమిషాలకు ఢిల్లీలోని బిర్లా నివాసంలోని ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా హత్యకు గురయ్యాడు. ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా గాంధీకి నాథురాం గాడ్సే ఎదురుపడ్డాడు. గాంధీకి నమస్కరించాడు. ఇప్పటికే సమావేశానికి ఆలస్యం అయ్యిందంటూ గాడ్సేను పక్కకు నెట్టేసే ప్రయత్నం చేయబోయింది గాంధీ అనుచరురాలు అభా ఛటోపాధ్యాయ. కానీ ఆమెను పక్కకు నెట్టిన గాడ్సే తన వెంట తెచ్చుకున్న తుపాకితో గాంధీపై మూడుసార్లు పాయింట్ బ్లాక్ రేంజ్‌లో కాల్పులు జరిపాడు.
దీంతో దేశ స్వాతంత్య్రోధ్యమానికి నేతృత్వం వహించిన మహాత్మాగాంధీ నేలకొరిగాడు. ఆ మహాత్ముడు అక్కడిక్కడే చనిపోయారు. ఆయన హత్య ఒక్క ఇండియానే కాదు యావత్ ప్రపంచాన్ని దిగ్ర్భాంతికి గురిచేసింది. భారతదేశాన్ని లౌకిక, అహింసా వాదంలో నడిపించేందుకు గాంధీజీ ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. గాంధీజీ చనిపోయిన జనవరి 30వ తేదీని అమరవీరుల దినోత్సవం గా పాటిస్తున్నారు. అలాగే భారత స్వాతంత్ర సమరంలో నిప్పుకణికలు భగత్ సింగ్, రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లు వీరి పేరు వింటే ప్రతీ భారతీయుని గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. ఈ ముగ్గురు వీరులు స్వాతంత్ర సమరంలో అలుపెరుగని పోరాటాలు చేసి ఉరికొయ్యలను ముద్దాడిన రోజు మార్చి 23 ను కూడా అమరవీరుల దినంగా జరుపుకుంటాము. భారత స్వతంత్ర సమరయోధుల వీరగాధల్ని స్మరించుకుంటూ..వారి పోరాటాలను గుండెలకద్దుకుంటాము.
ఎలా జరుపుకుంటారు?
అమరవీరుల దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ సమాధి అయిన రాజ్‌ఘాట్‌లో భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రక్షణమంత్రులు.. బహుళ వర్ణపూలతో అలంకరించిన దండలు వేసి గాంధీకి నివాళులర్పిస్తారు. దేశంలోని సాయుధ దళాల సిబ్బంది మరియు ఇంటర్ సర్వీసెస్ బృందం అమరవీరుల గౌరవ వందనం తెలియజేస్తాయి. అమరవీరుల జ్ఞాపకార్థంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటారు. ప్రముఖులు నివాళి అర్పంచడంతో పాటు యావత్తు దేశం మొత్తం కూడా ఆ భారతదేశ ముద్దు బిడ్డల్ని స్మరించుకుంటారు. ఇటువంటి జాతిపుత్రులను స్మరించుకోవడం వల్ల భావి భారత పౌరులకు మన వీరుల గొప్ప చరిత్రలు అందుతాయి. ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వాలు జరపడం ఎంతో అభినందనీయం.
(నేడు అమరవీరుల దినోత్సవం, గాంధీ వర్ధంతి)
దొడ్డి చంద్రం,
94926 95929