- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీరి సేవలను క్రమబద్ధీకరించాలి!
ఈ ఉద్యోగులంతా గత పదహేను, ఇరవై సంవత్సరాలుగా సమగ్ర శిక్ష అభియాన్‌లో కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్నారు. ప్రాథమిక స్థాయి విద్యా సమాచారాన్ని జిల్లాకు చేరవేయలన్నా, జిల్లా స్థాయి విద్యా సమాచారాన్ని ప్రాథమిక స్థాయికి చేరవేయలన్నా సమగ్ర శిక్ష అభియాన్‌లో పని చేస్తున్న సీఆర్పీలు, ఎమ్‌ఐయెస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లదే కీలకపాత్ర. వీరు తెలంగాణ పల్లెల్లో బాలికల చదువుకు బంగారు బాటలు వేస్తున్నారు.
సమగ్ర శిక్ష అభియాన్‌లో భాగమైన కేజీబీవీ ఉపాధ్యాయునీయులు, తెలంగాణ గ్రామాల్లో దివ్యాంగులకు విద్యా బుద్ధులు నేర్పుతున్నది సమగ్ర శిక్ష అభియాన్‌లో భాగమైన ఒప్పంద ప్రత్యేక ఉపాధ్యాయులు (ఐ.ఈ.ఆర్.పి లు), పాఠశాలల్లో విద్యార్థులకు డ్రాయింగ్, కుట్లు అల్లికలు నేర్పేది సమగ్ర శిక్షలో భాగమైన పీ టి ఐ లు. ఇంతటి సేవలందిస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు కనీస వేతనాలు లేకపోవడం, దీర్ఘకాల పెండింగ్ సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లే సమ్మెకు పిలుపు ఇచ్చారు.
కేజీబీవీలు బాలికల విద్యా కేంద్రాలు..
2004వ సంవత్సరంలో కేజీబీవీ పాఠశాలలను భారత ప్రభుత్వం ప్రారంభించింది. మన రాష్ట్రంలో 2005-2006లో కేజీబివీలు ప్రారంభించబడ్డాయి. అంటే సుమారు గత 20 సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా 479 కేజీబీవీ, 29 యుఆర్‌ఎస్ పాఠశాలల్లో సుమారు 12 వేల బోధన, బోధనేతర సిబ్బంది నియామకమై పని చేస్తున్నారు. ప్రారంభంలో 10వ తరగతి వరకే బోధిస్తున్న తరువాత 11,12 తరగతుల వరకు అప్‌గ్రేడ్ చేస్తూ కొనసాగిస్తుండడం అభినందనీయం. కానీ ఆయా తరగతులకు సరిపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులను నియమించక పోవడం వల్ల వారిపై పని ఒత్తిడి పెరిగింది. వీటి ప్రారంభంలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ వంటి రెసిడెన్షియల్‌లో భాగంగా ఉన్న కేజీబీవీలు ప్రస్తుతం సమగ్రశిక్ష అభియాన్‌లో భాగంగా ప్రభుత్వ, లోకల్ బాడీ ఉపాధ్యాయుల వలె జిల్లా విద్యాశాఖ అధికారి పరిధిలో రోస్టర్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా నియామకం అవుతూ, వారి పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమింపబడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే వేతనాలు పొందుతున్నారు. కాబట్టి రెగ్యులర్ చేయాలనే వారి డిమాండ్ న్యాయబద్ధమైనదే.
ఇంత తక్కువ వేతనాలా?
రాష్ట్రంలో ఉన్న ఇతర ఆశ్రమ పాఠశాలలతో పోల్చితే కేజీబీవీ ఉపాధ్యాయుల వేతనాలు చాలా తక్కువ. రెగ్యులర్ ఉపాధ్యాయుల కంటే మంచి ఫలితాలు సాధిస్తున్న రెగ్యులర్ ఉపాధ్యాయుల మినిమం బేసిక్ పేతో పోలిస్తే సగం జీతం కూడా కేజీబీవీ ఉపాధ్యాయులకు లేదు. వార్డెన్ లేకపోవడం వల్ల వారంలో ఒక రోజు, ఆదివారాల్లో, పండుగ రోజుల్లో కూడా తప్పనిసరిగా రాత్రి డ్యూటీ చేయాల్సి వస్తుంది. చాలా కాలంగా పే స్కేల్ ఇవ్వాలని కోరుతున్నప్పటికీ పీఆర్సీ కమిషన్ పే స్కేల్ ఇవ్వాలని సిఫారసు చేసినప్పటికీ 30 శాతం జీతాలు మాత్రమే పెంచారు. పే స్కేల్ ప్రస్తావనే రాలేదు. ఇతర కాంట్రాక్ట్ అధ్యాపక, ఉపాధ్యాయులకు ఇప్పటివరకు పే స్కేల్ ఇచ్చారు. వారి సర్వీస్‌ని కూడా రెగ్యులర్ చేశారు. కానీ ఎంతో కష్టపడి బాలిక అక్షరాస్యతకు కృషి చేస్తున్నా కేజీబీవీ ఉపాధ్యాయులను మాత్రం రెగ్యులర్ చేయకపోవడం శోచనీయం.
ఇది వెట్టిచాకిరి కాదా?
సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగ, ఉపాధ్యాయులను వెంటనే రెగ్యులర్ చేయాలి, సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగ, ఉపాధ్యాయులను విద్యాశాఖలో విలీనం చేసి పేస్కేల్ అమలు చేయాలి, ప్రతి ఉద్యోగి జీవిత బీమా, ఆరోగ్య బీమా కల్పించి 20 లక్షల ఎక్స్ గ్రేషియా కల్పించాలి, విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగులకు 20 లక్షలు ఎక్సగ్రెసియా ప్రకటించాలి, డీఎస్సీ నియామకాల్లో 30% వెయిటేజ్ ఇవ్వాలి, పదవీ విరమణ బెనిఫిట్స్ కల్పించాలి, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. రెగ్యులర్ ఉద్యోగ, ఉపాధ్యాయులు చేసే పని, కాంట్రాక్టు ఉద్యోగ, ఉపాధ్యాయులు చేసే పని ఒక్కటే అయినప్పటికీ కనీస వేతనాలు ఇవ్వకపోవడం వెట్టిచాకిరి కాదా? సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచ నీయం. గత 20 సంవత్సరాలుగా పని చేస్తున్నా రెగ్యులరైజేషన్ దేవుడెరుగు కనీసం పే స్కేల్ అయినా వర్తింపజేస్తే బాగుంటుందని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు వాపోతున్నారు.
రెగ్యులరైజేషన్ చేయాలి!
విద్యా వ్యవస్థకు వెన్నముక్కగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. బాలికల విద్య అంటేనే కేజీబీవీలు అనే విధంగా విద్యారంగంలో కేజీబీవీలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించి సేవలు అందిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. దాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలుగా స్వాగతించాం. రాష్ట్ర వ్యాప్తంగా 479 మంది కేజీబీవీలో, 29 మంది యు.ఆర్.యెస్‌లో మొత్తంగా సమగ్ర శిక్షలో భాగంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 19 వేల కాంట్రాక్టు ఉద్యోగ, ఉపాధ్యాయులందరిని వెంటనే రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేసేంతవరకు వారికి పే స్కేల్ ఇవ్వాలి. తెలంగాణ సబ్బండ వర్గాల సమగ్ర అభివృద్ధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు కూడా భాగం కావాలంటే వారి సర్వీస్‌ని వెంటనే క్రమబద్దీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, అప్పటి వరకు పే స్కేల్ ఇవ్వాలి.
జుర్రు నారాయణ యాదవ్,
TTU,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,
94940 19270