తుది దశకు ప్రక్షాళన

by Ravi |   ( Updated:2022-09-03 18:13:23.0  )
తుది దశకు ప్రక్షాళన
X

స్థానిక ఎం‌ఎల్ఏ, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి స్వయంగా రైతు కావడంతో ఈ కార్యక్రమాన్ని చాలెంజ్‌గా తీసుకున్నారు. గ్రామంలో ఒక్క రైతు కూడా నష్టపోవద్దనే సదుద్దేశంతో ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడారు. కలెక్టర్ హరీశ్ పర్యవేక్షణలో కీసర ఆర్‌డీ‌ఓ రవి నేతృత్వంలో తహసీల్దార్ రాజేశ్వర్‌రెడ్డి భూ సర్వే అధికారులతో కలిపి ఒక కమిటీ వేశారు. తనకు కార్మిక శాఖ కార్యక్రమాలు ఉండడంతో మేడ్చల్ నియోజకవర్గం ఇన్‌చార్జి చామకూర మహేందర్‌రెడ్డిని బాధ్యులుగా నియమించి కమిటీ పనులను పరుగులెత్తించారు. సమగ్ర ప్రక్షాళనకు కమిటీ ఒక రూట్ మ్యాప్ తయారు చేసింది. సమస్యల పరిష్కారానికి ఈ రూట్‌ మ్యాప్ ఒక దిక్సూచిలాంటిది.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలంలో సీఎం కేసీఆర్ దత్తత గ్రామం లక్ష్మాపూర్ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ముగింపు దశకు చేరుకుంది. మూడు జిల్లాల సరిహద్దు గల లక్ష్మాపూర్ గ్రామంలో పట్టా భూములు ఎంత మేరకు సాగులో ఉన్నాయి? అటవీ భూములు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? ఏ రకమైన పట్టాలు ఉన్నాయనే అంశం మీద రైతులు, అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం చాలా రోజులుగా ఉన్నది. ఈ వివాదాన్ని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 'గ్రామసభను నిర్వహించి, అటవీ, రెవెన్యూ , భూ సర్వే అధికారులతో కలిసి రైతుల సమక్షంలో భూ సరిహద్దులను రీసర్వే చేయించి సమస్యలు పరిష్కరించాలని' ఆదేశించారు. ఇది తెలంగాణాలో సీఎం కేసీఆర్ చేపట్టాలనుకున్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు ప్రారంభ అడుగులాంటిది. రికార్డుల ప్రక్షాళనకు అనేక రకాల అడ్డంకులు వచ్చాయి. అటవీ శాఖ అధికారుల ఒత్తిడి, ధరణి వెబ్‌సైట్ ప్రారంభం, భూ సర్వే అధికారులు వచ్చినప్పుడు రైతులు అందుబాటులో లేకపోవడం, కుటుంబ తగాదాలు, కరోనా కారణంగా జాప్యం జరిగింది.

చాలెంజ్‌గా తీసుకున్న మంత్రి

స్థానిక ఎం‌ఎల్ఏ, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి స్వయంగా రైతు కావడంతో ఈ కార్యక్రమాన్ని చాలెంజ్‌గా తీసుకున్నారు. గ్రామంలో ఒక్క రైతు కూడా నష్టపోవద్దనే సదుద్దేశంతో ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడారు. కలెక్టర్ హరీశ్ పర్యవేక్షణలో కీసర ఆర్‌డీ‌ఓ రవి నేతృత్వంలో తహసీల్దార్ రాజేశ్వర్‌రెడ్డి భూ సర్వే అధికారులతో కలిపి ఒక కమిటీ వేశారు. తనకు కార్మిక శాఖ కార్యక్రమాలు ఉండడంతో మేడ్చల్ నియోజకవర్గం ఇన్‌చార్జి చామకూర మహేందర్‌రెడ్డిని బాధ్యులుగా నియమించి కమిటీ పనులను పరుగులెత్తించారు. సమగ్ర ప్రక్షాళనకు కమిటీ ఒక రూట్ మ్యాప్ తయారు చేసింది. సమస్యల పరిష్కారానికి ఈ రూట్‌ మ్యాప్ ఒక దిక్సూచిలాంటిది.

రాష్ట్రములోని 77 రెవిన్యూ డివిజన్‌లు, 594 మండలాలలో ఉన్న అన్ని గ్రామాలలో ఇంత త్వరితగతిన అటవీ, రెవెన్యూ శాఖల వివాదాలు, రెవెన్యూ సమస్యలను పరిష్కరించిన దాఖలాలు లేవు. పట్టాల విషయంలో, భూమి స్వభావము విషయములో, విస్తీర్ణం విషయములో ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యలను పరిష్కరించాలనే తపనతో మంత్రి మల్లారెడ్డి స్వయముగా రెవెన్యూ అధికారులతో రెండు దఫాలుగా సదస్సులు నిర్వహించారు. 70 శాతం రైతులకు పట్టా పుస్తకములు అందచేసారు. గ్రామాలలో రెవెన్యూ క్యాంపును ఏర్పాటు చేసి, చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

అహర్నిశలు అధికారుల కృషి

లక్ష్మాపూర్ గ్రామములో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ఇంకా 30 శాతం పూర్తయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కలలుగన్న భూవివాదాలు, రెవెన్యూ సమస్యలు లేని గ్రామముగా ఏర్పడుతుంది. బంగారు తెలంగాణ ఏర్పాటులో ఈ గ్రామము ముందు వరుసలో ఉంటుంది. ఈ కల సాకారం కావడానికి సహకరిస్తున్న జిల్లా అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉంది. ప్రక్షాళనతో గత ఐదు సంవత్సరాలుగా రైతుబంధు, రైతుబీమా కోల్పోయిన రైతులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలనే విషయంలో మహేందర్‌రెడ్డి నాయకత్వములో డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ మధుకర్‌రెడ్డి, జడ్‌పీటీసీ హరివర్ధన్‌రెడ్డి, ఎంపీపీ హారికామురళి గౌడ్, సర్పంచ్ సింగం ఆంజనేయులు, ఎంపీటీసీ నాగరాజు, ఉప సర్పంచ్ వైద్యనాథ్‌తో గ్రామపెద్దలు, రైతులు, రైతు సమన్వయ సమితి నాయకులు, స్థానిక నాయకులతో చర్చించి తనకు రిపోర్టు అందచేయాలని మంత్రి మల్లారెడ్డి ఆదేశించడం కీలక పరిణామం.

ఈ ప్రక్షాళన పూర్తికావడానికి సీఎస్ సోమేశ్ కుమార్, సీసీఎల్‌ఏ, ధరణి టీమ్ గ్రామపెద్దల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం, మేడ్చల్ జిల్లా యంత్రాంగం టీమ్‌వర్క్‌ని తెలియచేస్తుంది. తహసీల్దార్ రాజేశ్వరరెడ్డి, సిబ్బంది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, అందరికీ అన్నిరకాల సమస్యలకు ఓపికతో సమాధానం చెబుతూ రాత్రింబవళ్లు పని చేశారు. ల్యాండ్ సర్వే అధికారులతో నిరంతరం సంప్రదించారు. భవిష్యత్తులో జరిగే తెలంగాణ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు లక్ష్మాపూర్ ఒక దిశను చూపిస్తుందని ఆశించవచ్చు. రైతు రాజ్యాధికారంలో ఉంటే, ఏ విధమైన ప్రయోజనాలు వుంటాయనేదానికి లక్ష్మాపూర్ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళననే ఒక ఉదాహరణ.

మధు క్రిష్ణ

96636 75435

Advertisement

Next Story