- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మందిరం చుట్టూ రాజకీయాలు..
అయోధ్యలో రామ మందిర నిర్మాణం భారత రాజకీయాలను ఒక మలుపు తిప్పుతుంది. ఈ మందిర నిర్మాణం ద్వారా బీజేపీ భారత రాజకీయాలను తనదైన రీతిలో శాసించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందుకే ఈ నెల 22న తలపెట్టిన రామ మందిర ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి ప్రపంచ దేశాల్లోనే అనేకమంది ప్రముఖులకు ఆహ్వానాలు అందించినట్లే దేశంలోని ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులకు అయోధ్య రామ మందిరం తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలను అందించింది. అయితే దీనికి హిందువులు అంటేనే గిట్టని వామపక్ష నాయకులు హాజరు కావడం లేదని తెగేసి చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్క చందంగా తయారైంది. యూపీఏ ప్రభుత్వం హయాంలో రామసేతు నిర్మాణాన్ని కూల్చాలనే విషయంలో 'రామాయణం మిథ్య' అంటూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించడం, హిందువులు ఈ విషయంపై ఆగ్రహించగానే ఆ అఫిడవిట్ ను విరమించుకోవడం వంటి విషయాలను హిందుత్వానికి నిజమైన వారసులు ఎప్పటికీ మర్చిపోరు. కాంగ్రెస్ పార్టీకి హిందువులు పూర్తిగా దూరమైతే ఈ దేశంలో ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఈ విషయంలో కాంగ్రెస్ ఎటువంటి తప్పటడుగులేసినా ఆత్మహత్యా సదృశ్యమవుతుంది. బీజేపీ తనదైన శైలిలో ఈ రామ మందిర నిర్మాణ క్రెడిట్‌ను ఖాతాలో వేసుకుని సామాన్య హిందువులలో తన పలుకుబడిని పదిల పరుచుకోవడం ఖాయం.
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 'శ్రీ రాముడు హిందువులకే కాదు, సమస్త మానవాళికి ఆదర్శమూర్తి అని. ఆయన ఆలోచనలు ఆచరణాత్మక మైనవని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా ప్రకటించడం, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ 'శ్రీ రాముడు మా ఇంటి ఇలవేల్పు' అని ప్రకటన ఇవ్వడం హిందూ వ్యతిరేక హిందూ రాజకీయ నాయకులను అయోమయ స్థితిలోకి నెట్టేసింది. రామ మందిర ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి హాజరైతే ముస్లిం, క్రైస్తవ ఓటర్లు ఎక్కడ చేజారిపోతారనే భయం ఒక పక్క, హాజరు కాకపోతే హిందూ సమాజంపై హిందుత్వ సంస్థల గుత్తాధిపత్యం ఏర్పడుతుందని మరొక భయం వీరిని ఆవరించింది. ఏది ఏమైనా ఈ దేశ మెజారిటీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా భవిష్యత్తు వారికి అందవికారంగా ఉండడం ఖాయం.
ఉల్లి బాల రంగయ్య,
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
94417 ౩౭౮౭౭
Read More..
Tirumala: తిరుమల నంబికి శాస్త్రోక్తంగా మేల్‌చాట్ శేష వస్త్రం సమర్పణ