మట్టి వినాయకుడిని పూజిద్దాం..!

by Ravi |   ( Updated:2024-09-07 00:45:47.0  )
మట్టి వినాయకుడిని పూజిద్దాం..!
X

దేశమంతా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి తరుణంలో మనం పండగలు, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాలి. జాగ్రత్తగా గమనిస్తే.. ప్రతి పండగ వెనకా ఓ మహోన్నత లక్ష్యం కనిపిస్తుంది. ప్రకృతిలో మమేకమవుతూ నేలా-నీరు, చెట్టూ - పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం అనాదిగా మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతూ వస్తోంది. మన భారతీయ సంస్కృతి గొప్పదనం ఇదే. కాబట్టి ఈ వినాయక చవితి ఉత్సవాల నుంచే కొత్త ఒరవడికి శ్రీకారం చుడదాం. మట్టి వినాయకుడిని పూజించి.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌ కారణంగా..

మట్టిలోంచే సకల ప్రాణులు, సంపదలు వచ్చాయని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అసలు వినాయకుడు పుట్టింది పార్వతి దేవి మేని నలుగు మట్టి నుంచే కదా అందుకే మనం మట్టి వినాయకునే పూజించాలి. అప్పుడే... భక్తి.. ముక్తి.. శక్తి. పైగా మట్టి వినాయకుడిని పూజించడం అంటే మన ప్రకృతిని పూజించడంతో సమా నం. మనకు జీవాన్ని, జీవితాన్ని, మనుగడని ఇస్తున్న ప్రకృతిని పూజించే అవకాశం మనకు వినాయకచవితి ద్వారా లభిస్తోంది. అలాంటి అవకాశాన్ని వినియోగించుకుందాం. వినాయకచవితి పండగ అంటేనే ప్రకృతితో ముడిపడి వుంటుంది. ఈ పండగకు ఉపయోగించే మట్టి వినాయకుడి ప్రతిమ కానీ, పత్రి కానీ ప్రకృతికి ప్రతిరూపాలే. వినాయకుడి బొమ్మని మట్టితోనే చేయాలని శాస్త్రం చెబుతోంది. మట్టి వినాయకుడైతే కాలుష్యం అనే ప్రశ్నే వుండదు. అందువల్ల మట్టి వినాయకుడిని పూజించడం మనకీ మంచిది, పర్యావరణానికి మంచిది.

కొనిండ్ల మోహన్

90527 11868

Advertisement

Next Story

Most Viewed