- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొత్తు పొడుపులకు మహానాడు వేదికా?
ఏపీలో సాధారణ ఎన్నికలకు సరిగ్గా ఏడాది కూడా లేదు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. అధికార వైసీపీ ఒంటరిగా వెళ్లేందుకు నిర్ణయించుకోగా. తెలుగుదేశం జనసేన కలిసి నడుస్తాయని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆ రెండు పార్టీల మధ్య సానుకూల వాతావరణం ఉంది. ఇటీవలే చంద్రబాబు, పవన్‌లు భేటీ అయ్యారు. ఏపీలో బీజేపీ, జనసేనతో పాటుగా టీడీపీతోనూ కలిసి వెళ్లేలా ప్రతిపాదన చేసారు. 2014 ఎన్నికల తరహాలో పొత్తుల ద్వారా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా, అదే సమయంలో మూడు పార్టీలకు మేలు జరిగేలా కార్యచరణ వివరించారు. దీని పైన బీజేపీ నుంచి స్పష్టత రాలేదని సమాచారం. పవన్ ఢిల్లీలో కేంద్ర బీజేపీ నేతలతో ఇటీవలే జరిపిన చర్చల సారాంశం తో పాటు, భవిష్యత్ ప్రణాళికపైనా చర్చలు చేసారు. పొత్తుల అంశంపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో బీజేపీ కాస్త భిన్నంగా ఉంది. బీజేపీని తమతో తీసుకెళ్లాలని చంద్రబాబు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అటు పవన్ సైతం అటువంటి ప్రయత్నమే చేశారు. కానీ ఇరువురు నేతల ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. దీంతో తాజా భేటీపై పలు ఊహాగానాలు, విశ్లేషణలతో రాజకీయ వర్గం తలమునకలౌతోంది.
ఊ అంటే ఊహూ అంటారేంటి?
పొత్తుపై బీజేపీ నిర్ణయం కోసం ఎదురుచూడటం, దాని పరిణామాలు బట్టి నిర్ణయం తీసుకుందామని ఇరువురి నేతల ఆలోచనగా తెలుస్తోంది. అయితే టీడీపీతో కలిసి వెళ్లే క్రమంలో బీజేపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. టీడీపీ అనుకూల పక్షమైన కొందరు నేతలు స్వాగతిస్తున్నారు. కానీ గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబుతో వెళ్లేందుకు మెజార్టీ కేడర్ నిరాకరిస్తోంది. కానీ ఒకరిద్దరు నాయకులు మీడియా ముందుకొచ్చి మాట్లాడడం ప్రాధాన్యతను సంతరించుకుంది.టీడీపీతో కలిసి వెళ్ళేందుకు బీజేపీలో కీలక నేతలు సుముఖంగా వున్నా అధినాయకత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కర్ణాటక ఎన్నికల తర్వాత ఈ విషయంపై స్పష్టత రావచ్చు. ఏపీలో బీజేపీ, జనసేనతో పాటుగా టీడీపీతోనూ కలిసి వెళ్లేలా ప్రతిపాదన చేసారు. 2014 ఎన్నికల తరహాలో పొత్తుల ద్వారా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా, అదే సమయంలో మూడు పార్టీలకు మేలు జరిగేలా కార్యాచరణ వివరించారు. దీని పైన బీజేపీ నుంచి స్పష్టత రాలేదని సమాచారం. ఇప్పుడు ఢిల్లీ చర్చల సారాంశం భవిష్యత్ ప్రణాళికపైనా పవన్ కల్యాణ్ చంద్రబాబుతో చర్చించారు.
ఎటూ తేలని సీట్ల పంచాయతీ
అయితే సీట్ల విషయంలో తెలుగుదేశం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆ విషయం తేల్చుకునేందుకే పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబు వద్దకు వెళ్లారు అని కొందరు అంటున్నారు. పవన్ కళ్యాణ్ 32 అసెంబ్లీ సీట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది ఆయా ప్రాంతాలలోని సామాజిక సమీకరణాలను దృష్టిలో వుంచుకొని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాల్లో తమకు ఎక్కువ సీట్లు కావాలని పవన్ డిమాండ్ చేస్తున్నారని ఒక 25 దాకా గెలిస్తే రేపటి ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో తమ ప్రభావం గట్టిగా ఉంటుందని పవన్ ఆలోచన . జనసేనకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే సీట్ల విషయంలో సీరియస్ గానే చర్చ సాగినట్లు తెలుస్తోంది. నిజానికి పొత్తులు ఏనాడో కుదిరాయి. సీట్ల వద్దనే పంచాయతీ తేలడం లేదు. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ బలంపైన ఆ పార్టీ నేతలు ఒక అంచనాకు వస్తారని, ఆ తర్వాత పొత్తుల విషయంలో సానుకూలత రావచ్చని ఈ ఇద్దరు నేతల అభిప్రాయం ఇటు క్షేత్ర స్థాయిలో చేయించిన సర్వేలతో పాటుగా ప్రధాన ఓటు బ్యాంకుగా భావిస్తున్న వర్గాలను తమ వైపు తిప్పుకోవటం కోసం కొత్త వ్యూహాలు అమలు చేయాలని నిర్ణయించారు. బీజేపీ కలిసి వస్తే మూడు పార్టీల పొత్తు, లేకుంటే టీడీపీ-జనసేన పొత్తుతో పాటుగా పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై పార్టీ తెలుగుదేశం మహానాడులో పొత్తుల పైన ప్రకటన రావచ్చు.
కమలం తో పొత్తు వికసిస్తుందా, వికసిస్తుందా
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అంటారు. చంద్రబాబు ఈ సూత్రాన్ని నూటికి నూరు శాతం అనుసరిస్తారు. ఆయనకు నచ్చకపోతే దూరం జరుగుతారు. నచ్చితే మళ్లీ దగ్గర చేరేందుకు ఆరాటపడతారు. టీడీపీని తన చేతుల్లోకి తీసుకున్నాక చంద్రబాబు మార్క్ రాజకీయ విన్యాసం అందరికీ తెలిసిందే. దేశాభివృద్ధి కోసం తెలుగు ప్రజల కోసం తన పరిధిలో తాను పనిచేస్తున్నానని, ప్రధాని విజన్‌తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని . ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా తన పరిధి మేరకు కలిసి పనిచేయడానికి సిద్ధమని, భారతదేశ బలమేమిటో.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి చాటి చెబుతున్నారని చంద్రబాబు తాజాగా వ్యాఖ్యానించారు. తాను మోదీ పాలసీలను వ్యతిరేకించలేదని, ప్రత్యేక హోదా సెంటిమెంట్ గా మారిందని, దాని మీద మాత్రమే తాను అప్పట్లో పోరాడానని చంద్రబాబు వివరించడం గమనార్హం. బీజేపీతో బాహాటంగా జట్టు కట్టడానికి తన వైపు నుంచి ఆయన సంకేతాలు పంపినట్లుగానే భావించవచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
టీడీపీతో పొత్తుకు ససేమిరా...
భారతీయ జనతా పార్టీ చంద్రబాబు వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు కీలకం కావొచ్చు. ఎందుకంటే టీడీపీతో పొత్తులో ఉంటే నేరుగా ఎన్డీఏలో కూటమిలో దాన్ని కలుపుకోవచ్చు. వైఎస్ఆర్‌సీపీతో అలాంటి అవకాశం ఉండదు. తన పార్టీకి పూర్వ వైభవం తెప్పించుకునేందుకు కష్టపడుతున్నారు చంద్రబాబు. వైసీపీతో మాత్రం తెగించి పోరాడుతున్నారు. విజయం లభిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అలా జరగాలంటే బీజేపీ మద్దతు ముఖ్యమనుకుంటున్నారు. అందుకే చంద్రబాబు బీజేపీ విషయంలో సానుకూలంగా ఉన్నారు, కానీ రాష్ట్ర స్థాయిలో బీజేపీ నాయకులు టీడీపీతో పొత్తు కు సుముఖంగా లేరు. అలాగని జనసేనతో కూడ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
త్వరలోనే ఏపీలో భారీగా చేరికలు ఉంటాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా పెద్దఎత్తున నేతలు.. బీజేపీలో చేరుతారంటూ రాజమండ్రి బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు గమనార్హం. రాష్ట్రంలో వైసీపీని గద్దె దించి బీజేపీ-జనసేన కూటమి అధికారం చేపట్టాలన్నదే తమ లక్ష్యమని, నిజానికి తెలుగుదేశం పార్టీ కంటే కూడా అసలైన ప్రతిపక్ష పాత్రను తామే పోషిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ బీజేపీతో పొత్తు కోరుకుంటూనే.. మరోవైపు తమ పార్టీకి చెందిన ముఖ్య నేతలను టీడీపీ లాక్కుంటోందని బీజేపీ ఆరోపణ.
((ఉమ్మడి పోరుకు బాబు విశ్వప్రయత్నం
బీజేపీ-జనసేన కూటమిగా ఎన్నికలకు వెళతాయని ఓ పక్క ప్రకటిస్తూ కాంగ్రెస్ నాయకులని తమ వైపు తిప్పుకుని గ్రామీణ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకును తమ ఖాతాలో కలుపుకుంటే కొద్దో గొప్పో సీట్లను దక్కించుకోవచ్చు అన్నది బీజేపీ రాష్ట్ర నేతల వ్యూహం. ఇటీవలే బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీలోకి చేరతారా అన్నది కర్ణాటక ఫలితాల తర్వాత తేలనుంది. అదే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లింలు ఈసారి టీడీపీకి మద్దతిస్తారా లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. లోకేష్ పాదయాత్రలో భాగంగా యువతకు, మహిళలకు అవకాశాలు కల్పిస్తాం అంటూ ఇస్తున్న హామీలు తెలుగుదేశం శ్రేణులలో జోష్‌ని నింపాయి. అయితే తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఇంకా వర్గ విభేదాలతో రాజకీయం చేస్తూ అధినేతకు తలనొప్పిగా మారారు.
వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చే నాయకులను పార్టీలో టిక్కెట్లు ఆశించే ఆశావహులను సమన్వయం చేయడం కోసం చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు దీనికి గాను పార్టీ సీనియర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేసి సమీక్షిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీతో పొత్తు రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపినా చూపకపోయినా జాతీయ స్థాయి రాజకీయాలలో ప్రభావం చూపవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను కలుపు కొంటే 10 -15 సీట్లు తెలుగుదేశం దక్కించుకోగలదు. ఈ వ్యూహం వల్ల బి.ఆర్ యస్ . వైకాపా ఓట్లను చీల్చి వచ్చు అనేది రాజకీయ వ్యూహకర్తల అంచనా. ఏది ఏమైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం -ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడి ఎన్నికలను ఎదుర్కోవాలి అప్పుడే మార్పు సాధ్యం.))
వాడవల్లి శ్రీధర్
99898 55445