ఓటరన్నా నీకో విన్నపం..

by Ravi |   ( Updated:2023-11-29 23:30:40.0  )
ఓటరన్నా నీకో విన్నపం..
X

ఓటరన్నా.. ఓటు హక్కును సద్వినియోగపరుచుకోండి. ఇప్పటికే మీ మీ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థిని గురించి మీకు ఓ అవగాహన వచ్చే ఉంటుంది. అందులో ఎవరు మంచివారో, ఎవరూ సామాన్యులకు అందుబాటులో ఉంటారో.. ఎవరు సేవ చేయ్యగలరో ఆలోచించి, మీ సమూహంతో చర్చించి ఓటు వేయండి.

ప్రతి ఓటరు తన వాడ, గ్రామం, నియోజకవర్గం పరిధిలో పార్టీలకు సంబంధం లేకుండా, పార్టీ ముఖ్యనాయకులకు సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేసే నాయకుడను , /నాయకురాలును ఎన్నుకోండి. వారు స్వతంత్ర అభ్యర్థులైన సరే! స్వతంత్ర అభ్యర్థులకు నేను ఓటు వేస్తే గెలుస్తాడా? అనే ఆలోచన నుండి బయటకు రండి. ప్రతి ఓటరు కనీసం 100 కుటుంబాలను ఒక్కరోజులో ప్రభావితం చెయ్యగల సమర్థుడు. కాబట్టి ప్రతి పోలింగ్‌బూత్ పరిధిలో ఉన్న ఓటరు బాధ్యతగా, పార్టీలకు సంబంధం లేకుండా నిజాయతీ పరుడికి కనీసం 400 ఓట్లు పడేలా చేస్తే, నిజాయతీ పరులు గెలుస్తారు, తద్వారా ఓటర్లు కూడా గెలుస్తారు. ఒకవేళ పోటీ చేస్తున్న అభ్యర్థులలో నిజాయితీ పరులు ఎవ్వరు లేకపోతే నోటాకి అయిన ఓటు వేయండి. కానీ ఓటును తప్పనిసరిగా సద్వినియోగపరచుకోండి!

ఆర్. సంతోష్ బాబు

88852 23939

Advertisement

Next Story

Most Viewed