- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల సెలవులు.. వ్యత్యాసాలు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఉద్యోగుల సౌకర్యార్థం పలు ప్రయోజనకర ఉత్తర్వులను వెలువరించాయి. అందులో ఉద్యోగుల సెలవు నిబంధనలు కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వ సెలవు నిబంధనలను మన రాష్ట్ర ప్రభుత్వ సెలవు నిబంధనలతో కలిపి పరిశీలిస్తే, చాలా రకాల సెలవుల విషయంలో సారూప్యత, కొన్ని సెలవుల విషయంలో భేదాలు కనిపిస్తాయి అవి ఏంటో చూద్దాం.
1. వెకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పది రోజుల ఆర్జిత సెలవు జమ చేయబడుతుంది. కానీ మన రాష్ట్ర ఉద్యోగులకు ఆరు రోజులు మాత్రమే నిల్వ చేయబడుతుంది.
2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జాయినింగ్ టైం వదులుకుంటే ఆ సదరు కాలము ఆర్జిత సెలవుగా మార్చబడి వారి సెలవు ఖాతాకు జమ చేయబడుతుంది. ఇది గరిష్టంగా 15 రోజుల వరకు అనుమతిస్తారు. మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సౌలభ్యం లేదు.
3. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అర్థ జీతపు సెలవు ప్రతి సంవత్సరమునకు 20 రోజుల అర్హత ఉన్ననూ వారికి జనవరి 1న 10 రోజులు, జులై 1న 10 రోజులు రెండు విడతలుగా ముందస్తుగా సెలవు ఖాతాకు జమ చేస్తారు. కానీ మన రాష్ట్ర ఉద్యోగులకు వారు జాయిన్ అయిన తేదీ నుంచి ఒక సంవత్సర సర్వీసు పూర్తి అయితేనే సెలవు ఖాతాకు 20 రోజులు జమ చేయబడుతుంది. ఒక సంవత్సరమునకు ఒక్కరోజు తక్కువ ఉన్నను అర్ధ జీతపు సెలవు జమ చేయబడదు.
4. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కమ్యూటెడ్ లీవ్ విషయంలో పరిమితి లేకుండా వారి ఖాతాలో జమయున్న అర్ధ జీతపు సెలవులో సగం వరకు వారు మొత్తం సర్వీసులో వినియోగించుకోవచ్చు. మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం సర్వీసులో ఇది 240 రోజుల వరకు మాత్రమే పరిమితం.
5. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లీవ్ నాట్ డ్యూ వారి మొత్తం సర్వీసులో 360 రోజులకు మించకుండా మంజూరు చేయబడుతుంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గుల విషయంలో ఇది 180 రోజులు మాత్రమే.
6. తాత్కాలిక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొన్ని వ్యాధుల చికిత్స నిమిత్తమై వారికి లీవ్ నాట్ డ్యూ గరిష్టంగా 360 రోజులకు మించకుండా మంజూరు చేస్తారు. మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సౌకర్యం లేదు.
7. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఇదివరకే మంజూరైన సెలవును మరొక రకమైన సెలవుగా మార్చుకోవడానికి సౌకర్యం కలదు.
8. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరోగసి విషయంలో సరోగేట్, కమిషనింగ్ తల్లికి 180 రోజుల పాటు ప్రసూతి సెలవు మంజూరు చేస్తారు. ఈ సెలవు మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులకు లేదు.
9. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరోగసి, పిల్లల దత్తత విషయంలో పితృత సెలవు మంజూరు చేస్తారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సౌకర్యం లేదు.
10. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చైల్డ్ అడాప్షన్ లీవ్ 150 రోజుల వరకు మంజూరు చేస్తారు. ఇట్టి సెలవు మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు లేదు.
11. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 730 రోజుల చైల్డ్ కేర్ లీవును వారి మొత్తం సర్వీస్‌లో వాడుకొనవచ్చును. ఇట్టి లీవ్ ఒక క్యాలెండర్ సంవత్సరంలో మూడు విడతలకు మించి మంజూరు చేయబడదు. ఒక విడతలో ఐదు రోజుల కంటే తక్కువ కాలానికి మంజూరు చేయకూడదు. ఇట్టి లీవ్ మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 90 రోజులు మాత్రమే కలదు. ఇట్టి లీవ్‌ను ఒకే విడతలో 15 రోజులకు మించకుండా, 5 విడతలకు తక్కువ కాకుండా మొత్తం సర్వీసులో ఉపయోగించుకోవచ్చు.
12. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రత్యేక సెలవు 90 రోజులు వరకు కొన్ని నిబంధనలకు లోబ డి అనుమతిస్తారు. మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ వెసులుబాటు లేదు.
ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల లీవుల విషయంలో చాలా అనుకూలతలు ఉంటాయి.. ఉద్యోగులకు సంబంధించిన లీవ్‌లు కాలానుగుణంగా మార్పులకు లోనవుతూ ఉద్యోగుల అవసరాన్ని తీర్చే విధంగా ఉంటున్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇచ్చే లీవ్‌లను కూడా మనం గమనించవచ్చు.
- సి. మనోహర్ రావు,
రిటైర్డ్ ప్రభుత్వ అధికారి
85198 62204