- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం చెప్పినా మంచి తిండి పెట్టరా?
హాస్టల్‌లో, గురుకులాల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం పెడతామని రాష్ట్ర సర్కారు ప్రకటించింది. కానీ వారికి ఇప్పటికీ దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్నారు. కొన్ని నెలలుగా మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్ నుంచి పిట్టలు కట్టిన, పురుగు పట్టిన, మక్కిన బియ్యాన్ని అనుమతిస్తున్నారు. వీటిపై అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో విద్యార్థులు తరచుగా వాంతులు విరేచనాలతో అస్వస్థకు గురై ఆస్పత్రి పాలవుతున్నారు.
అయితే ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నా కూడా ప్రభుత్వ అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో, గురుకులాల్లో జరుగుతున్న సమస్యలను పరిష్కరించి హాస్టల్స్ కోసం ప్రత్యేక అధికారులను నియమించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకుల రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మంచి తిండి పెట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని ఆశిస్తున్నారు.
సన్నబియ్యం బంద్
సంక్షేమ హాస్టల్‌లో, గురుకులాలు, కేజీబీవీలో, పెడుతు న్న తిండి తినలేకపోతున్నామని నాణ్యమైన ఆహారం పెట్టాలని, కలుషిత నాణ్యతలేని భోజనం పెడుతున్నారని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా రాష్ట్రంలో విద్యా ర్థులు రోడ్డు ఎక్కుతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల్లో సంక్షేమ హాస్టల్‌లో తరచుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. దీనివల్ల విద్యా ర్థుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో దాదాపుగా 48 మంది విద్యార్థులు మరణించడం జరిగింది. నాణ్యమైన భోజనం కల్పిస్తామంటున్న ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలోని ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఇలా ఎక్కడ చూసినా గురుకులాల్లో, ప్రభుత్వ వసతి గృహాల్లో, గిరిజన ఆశ్రమ పాఠశాలలో, ఫుడ్ పాయిజన్ అయిన సంఘటనలు చాలా జరుగుతున్నాయి. దీనికి ఎవరు కారకులు..? ఎవరికీ ఏం పట్టనట్టు ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా అధికారులు ప్రభుత్వ విభాగాలు వ్యవహరిస్తున్నాయి. ఎంతోమంది విద్యార్థులు అర్థాకలితో కడుపు నింపు కుంటూ వారి చదువులను కొనసాగిస్తున్నారు. ఏ జిల్లాలో చూసినా రోజుకు ఏదో ఒక చోట ఏదో ఒక హాస్టల్లో కలుషితమైన ఆహారం తిని విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్యకు గురవుతున్నారు.
వరుసగా ఫుడ్ పాయిజన్
హాస్టల్‌లో భోజనం బాగుండలేదని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తోంది. ప్రస్తుత ధరలతో పోల్చుకుంటే ఇది ఏ మూలకు సరిపోవడం లేదు. దీంతో మెనూలో క్వాలిటీ, క్వాంటిటీ తగ్గుతున్నాయి. దానికి తోడు రోజురోజుకు నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం వసతి గృహాలకు బడ్జెట్ పెంచకుండా కాలం చెల్లిస్తూ.. ప్రభుత్వ నిర్వాహకులు వంట సామాగ్రిలను థర్డ్ క్వాలిటీ వస్తువులను తీసుకొస్తూ.. కాలం చెల్లిన సరుకులు, కుళ్లిన కూరగాయలు, పుచ్చి పప్పులు వాడుతూ.. అపరిశుభ్రత వాతావరణంలో వంట చేయడంతో తరచూ విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు అస్వస్థతకు గురవుతున్నారు. వసతి గృహాల సంబంధించిన సంక్షేమ శాఖల అధికారులు ఇప్పటివరకు ఎలాంటి పర్యవేక్షణ చేయకుండా కార్యాలయాలకు పరిమితమై, ప్రమాదాలు జరిగినప్పుడు ఏదో తూతూ మంత్రంగా వాటిని పరిశీలించడం జరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తులో నుంచి లేచి పర్యవేక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
- దేవేందర్ ముంజంపల్లి,
జర్నలిజం పరిశోధక విద్యార్థి,
89784 58611