గవర్నర్ పదవి పంజరంలో చిలుకనా?

by Ravi |   ( Updated:2022-09-27 18:45:34.0  )
గవర్నర్ పదవి పంజరంలో చిలుకనా?
X

రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినపుడు రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫారసు చేసే అధికారం గవర్నర్‌కు ఉన్నది. గవర్నర్ తన విధి నిర్వహణలో వ్యవహరించిన తీరుపై న్యాయస్థానాలలో ప్రశ్నించే అధికారం లేదు. భారత సమాఖ్యలో గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా, రాజ్యాంగపర అధిపతిగా ఉంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. తన మూడేళ్ల కాలంలో దాదాపు 50 వేల మంది కలిసానని స్వయంగా గవర్నర్ తెలిపారు. మరి, అందులో ఎంత మందికి రాజ్యాంగపరంగా ప్రయోజనం కలిగింది? విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులను నియమించాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు కల్పించాలని, సమాచార హక్కు చట్టం సక్రమంగా అమలు కావడం లేదని, ప్రజా సమస్యలు నివేదించడానికి ప్రభుత్వం సమయం ఇవ్వడం లేదని గవర్నర్‌కు వినతులు వస్తున్నాయి.

ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయాధికారాన్ని కలిగి ఉంటారు. ప్రజాస్వామ్యంలో నాయకులు రెండు నియమాలను అనుసరించాలి. అందులో ఒకటి ప్రజలను సమానంగా చూడటం, రెండవది ప్రజలందరు సమాన స్వాతంత్ర్యాన్ని అనుభవించే అవకాశం కలిగించడం. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 యేండ్లు. రాజ్యాంగం వచ్చి 72 యేండ్లు. ఇప్పటికీ రాజ్యాంగాన్ని 105 సార్లు సవరించారు. అయినా, అది ఆర్థిక స్థోమత లేని పౌరులకు ప్రభుత్వపరంగా పని కల్పించే హక్కు, ఉచిత సత్వర న్యాయం, విద్య, వైద్యం వంటివి పొందే అవకాశం కల్పించలేకపోతోంది.

చట్టసభల ప్రతినిధులను పార్టీ ఫిరాయించకుండా నిరోధించలేకపోతోంది. ప్రజలకు తమ అభీష్టాన్ని తెలిపే హక్కునూ ఇవ్వలేకపోతోంది. రాజ్యాంగంలో ఉన్న ప్రజా సంక్షేమ మార్గదర్శకాలను కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దాటవేస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం సాధనంగా ఉపయోగించుకుంటున్నాయి.

అలా జరగకపోవడంతో

తెలంగాణ ప్రభుత్వానికీ, తనకు వివాదాలు ఉన్నాయని స్వయంగా గవర్నరే చెబుతున్నారు. గవర్నర్ బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం తరఫున ప్రతి విమర్శలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ పద్మజా నాయుడు గవర్నర్ పదవిని 'పంజరంలో చిలుక'గా అభివర్ణించారు. ప్రజాస్వామ్య దేశంలో తరచుగా గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు వివాదాలు వస్తున్నట్టు? 1994లో ఎస్ ఆర్ బొమ్మయి కేసులో సుప్రీంకోర్టు 'గవర్నర్ పదవి రాజకీయాలకు అతీతంగా, సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా, మానవత విలువలు, సమైక్యతా స్ఫూర్తి వంటి ఉత్తమ లక్షణాల ప్రాతిపదికపై నిర్వహించాలి' అని అభిప్రాయపడింది. కానీ, అలా జరగుతున్నదా? గవర్నర్‌ అధికారాలను రాజ్యాంగంలోని 153 నుంచి 167 వరకు గల ప్రకరణలలో వివరించారు. వీటి ప్రకారం ప్రధాన కార్య నిర్వహణ అధికారిగా గవర్నర్ పేరుతో రాష్ట్ర పాలన సాగుతుంది.

గవర్నర్‌కు కార్యనిర్వాహక అధికారాలు, శాసన నిర్మాణ అధికారాలు, ఆర్థిక అధికారాలు, న్యాయాధికారాలు, విచక్షణాధికారాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి, మంత్రి మండలి నియామకం, అడ్వకేట్ జనరల్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం, వారి ప్రమాణ స్వీకారం, శాసనసభను సమావేశపరచడం, వాయిదా వేయడం, రద్దు చేయడం వంటివి గవర్నర్ చేయాలి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలి. సభ ఆమోదం తెలిపిన బిల్లులకు చట్ట రూపమివ్వాలి. వాటిని పున:పరిశీలన చేయమని సూచించే అధికారాలు కూడా ఉన్నాయి. కాగ్ నివేదికలను శాసనసభ ముందుంచడానికి, బడ్జెట్ ప్రవేశపెట్టడానికి, ద్రవ్య బిల్లును విధాన సభలో ప్రవేశ పెట్టడానికి అనుమతులు ఇవ్వాలి. ఉరి తప్ప న్యాయస్థానం వేసే శిక్షలను తగ్గించే అధికారం ఉంది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, మంత్రిమండలి లేకుండా విచక్షణాధికారాలకు పూనుకునే అవకాశం ఉంది. రాష్ట్ర పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలి.

ప్రభుత్వాలు చొరవ చూపనప్పుడు

రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినపుడు రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫారసు చేసే అధికారం గవర్నర్‌కు ఉన్నది. గవర్నర్ తన విధి నిర్వహణలో వ్యవహరించిన తీరుపై న్యాయస్థానాలలో ప్రశ్నించే అధికారం లేదు. భారత సమాఖ్యలో గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా, రాజ్యాంగపర అధిపతిగా ఉంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. తన మూడేళ్ల కాలంలో దాదాపు 50 వేల మంది కలిసానని స్వయంగా గవర్నర్ తెలిపారు. మరి, అందులో ఎంత మందికి రాజ్యాంగపరంగా ప్రయోజనం కలిగింది? విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులను నియమించాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు కల్పించాలని, సమాచార హక్కు చట్టం సక్రమంగా అమలు కావడం లేదని, ప్రజా సమస్యలు నివేదించడానికి ప్రభుత్వం సమయం ఇవ్వడం లేదని గవర్నర్‌కు వినతులు వస్తున్నాయి.

ఎంపీలు, కార్మిక శాఖ, సంస్థల యాజమాన్య ప్రతినిధులతో కూడిన 'హై పవర్ కమిటీ' సిఫారసు చేసిన వేతన భత్యాలను చెల్లించాలని ఎనిమిదేండ్ల నుంచి కోల్ ఇండియా, సింగరేణి కార్మికులు కోరుతున్నారు. వాటిని పరిష్కరించే ప్రభుత్వ యంత్రాంగం లేదు. ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల బాధలను తీర్చడానికి చొరవ చూడనప్పుడు గవర్నర్ స్పందించే అధికారం ఉన్నది. రాజ్యాంగ అధిపతిగా, రాజ్యాంగ మార్గదర్శకులుగా ప్రజల సమస్యలు పరిష్కరించి గవర్నర్ ఆపద్బంధువు కావాలి.

మేరుగు రాజయ్య

కేంద్ర కార్యదర్శి

సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్

94414 40791

Advertisement

Next Story

Most Viewed