- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పన్ను స్లాబ్‌ల మార్పు ఒక మాయ!
భారత ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడిదారుల, రాజకీయ నాయకుల ప్రయోజనాలకు ఏమాత్రం భంగం కలగకుండా అన్ని ప్రయోగాలు చేస్తోంది. అదే సమయంలో మధ్య తరగతి ప్రజలైన ఉద్యోగుల్ని నడ్డి విరిచేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు.
వాస్తవానికి ఉద్యోగులు చేసిన పనికి చెల్లించే వేత నంపై పన్నులు ఎందుకు? ఆదాయం అంటే ఏంటి? ఈ వర్గాల నుండి ఎంత వసూలు చేస్తు న్నారు? ఈ లెక్కల్లో పారదర్శకత లోపించింది. జీతంలో మిగులునే ఆదాయం అనాలి. జీతంలో కుటుంబ జీవన అవసరాలు పోగా మిగిలినదే కదా ఆదాయం అంటే! జీతంలో కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు పన్ను చెల్లిస్తుండగా మరో పన్ను ఏంటి? అయినా గ్రాస్ ఆదాయం ఎలా అవుతుంది. ఉద్యోగులకు మాత్రమే ఆదాయం వస్తుందా? కోట్లు ఆర్జించే మిగిలిన సంపన్న వర్గాలకు ఈ సిద్ధాంతం, ఈ సూత్రీకరణ వర్తించదా?
పన్ను స్లాబులు..
కేంద్ర ఆర్థిక మంత్రి మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉద్యోగ వర్గాలకు ఎలాంటి ప్రయోజ నం లేదు. కేవలం కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ 50 నుంచి 75 వేలకు మాత్రం పెంచారు. అంతకు వినా చేకూరిన ప్రయోజనం శూన్యం! ఆ పెంపు ఒక ఏడాదిలో డి.ఏ ద్వారా అందే మొత్తాన్ని మింగేస్తుంది.
రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5 శాతం
రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 10 శాతం
రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15%
రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20%
రూ.15 లక్షలకు మించి ఆదాయంపై 30% పన్ను
అంతా జేబుకు కన్నం వేసే ప్రక్రియే..!
కొన్ని ప్రాంతాల్లో మామిడి పండ్లు అమ్మేవాళ్ళు "ఆజ్ కా ఆమ్ మిట్టా, కల్ కా ఆమ్ కట్టా" అని అరుస్తుంటారు. దీనర్థం "నిన్నటి మామిడి పండ్లు చేదు, ఈరోజు పండ్లు తీపి" అని. తమ వద్ద ఉన్న పండ్లు రేపటి రోజుకు మిగలకుండా ఈరోజు సరుకును ఈరోజే అమ్ముకునే వ్యాపారి పరమార్థమది. వ్యాపారి ఒకరే! ధర ఒకటే... అవే సందుల్లో, అవే వీధుల్లో అమ్మే కాయలూ అవే, కాయల లెక్కన అమ్మినా, బరువు లెక్కన తూకం వేసి విక్రయించినా తాను పొందాలనుకునే లాభాన్ని వ్యాపారి ఒడిసి పట్టుకుంటాడు. కాకపోతే రోజు మారుతుంది. పాలకులు వారే, పాలితులూ ఒకరే... మారింది స్కీమ్ మాత్రమే. ఆదాయ పన్ను లెక్కించే ఆర్థిక శాఖలోని గణికులు కూడా అంతే! శ్లాబులు కుదించినా, కొత్త చిట్కాలతో మదించినా జేబుకు కన్నం వేసి ప్రక్రియ ఒక్కటే! ఆయా ప్రభుత్వాలు చెప్పినట్లు వినాల్సిందే.
ఇంచుమించు 8 దశాబ్దాల స్వాతంత్ర కాలంలో ఉద్యోగ వర్గాలను సంతోషపెట్టిన దాఖలాలు లేవు. ఎటుతిరిగీ ఏడాదికి ఒక నెల రోజులు లేదా అంతకు పెచ్చు ఉద్యోగి జీతం నుంచి పన్ను రూపంలో గుంజుకునే పన్ను విధానాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ప్రత్యే కించి గడిచిన పదేళ్ల కాలంలో ఈ దోపిడీ కొత్త మొగ్గలు తొడిగింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల జీతంలో 50 శాతం పన్నులు కట్టడానికే సరిపోతోంది. కనీసం బ్యాంకుల్లో వ్యక్తిగత రుణం తీసుకున్నా జీఎస్టీ చెల్లించాల్సి రావడంలో ఎంత దోపిడీ దాగివుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
విదేశీ రుణాల కోసం వేలం వెర్రిగా..
ఉద్యోగులకు ఏడాదికి వచ్చే ఒక ఇంక్రిమెంటూ, ఆర్నెల్లకోసారి ధరల పెరుగుదలకు అనుగుణంగా అందించే కరువు భత్యం వస్తుంది. అయితే అంతేమేర ఆదాయపన్ను చెల్లింపులోకి చేరు తోంది. ఆదాయపు పన్ను చెల్లింపులు దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలనే లక్ష్యం నామమాత్రమే. సుస్థిర అభివృద్ధి జరగాలంటే పెద్దఎత్తున పెట్టుబడులు కావాలి. ఆ పెట్టుబడులను పన్ను చెల్లింపుదారుల నుండి సునాయాసంగా సేవింగ్స్ రూపంలో పోగు చేసుకునే అవకాశం ఉంటుంది. అలా సేకరించే మొత్తాలకు పరిమితిని రద్దు చేస్తే స్థిరమైన ఆర్థిక వ్యవస్థకు పునాదులు ఏర్పడతాయి. కానీ ఆ దిశగా ఆలోచించడం మానేసి విదేశీ రుణాలకోసం వేలం వెర్రిగా ఎగబడటం ప్రభుత్వాలకు నిత్యకృత్యమైంది. అది కూడా అధిక వడ్డీలకు. అది కూడా దేశంలోని ఆస్తుల పూచీకత్తు మీద.
ఉద్యోగులకు మిగిలేది బిక్కమొహమే!
ప్రజారుణం, బాహ్య రుణం, అంతర్గత రుణం మొత్తం కలిపి 151 లక్షల కోట్లు అని గణాంకాలు చెబుతున్నాయి. ఈ రుణాలపై చెల్లించే వడ్డీ జీడీపీలో 30% కంటే ఎక్కువగా వుంది. వడ్డీ చెల్లింపు రూ. 10.80 లక్షల కోట్లు లేదా ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ వ్యయంలో 24%గా అంచనా వేశారు. దేశ బడ్జెట్ ప్రశ్నించే స్థాయికి చేరింది. గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నామని సగర్వంగా చెబుతున్నా ప్రభుత్వం సదరు అభివృద్ధిని అందుకుంటున్న వారి సంఖ్యను కూడా బేరీజు వేయాలి. తక్కువ వడ్డీకి లభించే సామాజిక సేవింగ్స్‌ను పెంచుకోవడం ప్రభు త్వాల బాధ్యత. ప్రభుత్వ పథకాల ద్వారా ఉద్యో గుల కుటుంబాలకు ఇసుమంత వర్తింపు అవకా శం లేదు. 30 నుంచి 40 నలభై సంవత్సరాల సేవల అనంతరం కూడా ప్రభుత్వాల దోపిడీ విధానాల వల్ల వారు కనీస ఆర్థిక స్థిరత్వం లేక బిక్కమొహంతో ఇంటి ముఖం పడుతున్నారు.
సున్నకు సున్న హళ్లికి హళ్లి!
ఎన్ని స్కీములు మార్చినా, ఎన్ని స్లాబులు వచ్చినా, ఎన్ని వ్యవస్థల రూపకల్పన జరిగినా ఉద్యోగ వర్గాలకు ఒనగూరే ప్రయోజనం శూన్యం. ఎన్ని ప్రతిపాదనలు వచ్చినా, ఎన్ని ప్రాతినిధ్యాలు చేసినా, ఉద్యమాలకు వెళ్లే ఉద్యోగులకు మిగిలే ది, అలసట, కంఠశోష! ఇదిలా వుండగా ఉద్యోగులకేదో కోట్ల ఆదాయం వచ్చే విధంగా బడ్జెట్ రూపకల్పన జరిగినట్లు ప్రభుత్వ అనుకూల మీడియా గోబెల్స్ ప్రచారం చేయడం దురదృష్టకరం. ఉద్యోగి 12 నెలల కాలంలో అందుకున్న జీతంలో ప్రతి నెలలోనూ 7 రోజుల జీతాన్ని నిఖార్సుగా ప్రభుత్వానికి వెనక్కి కట్టాల్సిందే! అది కూడా ఏ నెలకానెల ముందస్తుగా!
మోహన్ దాస్,
రాష్ట్ర నాయకులు, ఏపీటీఎఫ్
94908 09909