- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెగా డీఎస్సీపై భారీ ఆశలు...
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్సీకి ఆమోదం ఇస్తామని, 2024 ఏప్రిల్, డిసెంబర్‌లో టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు.. గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి 13వేల టీచర్ల పోస్టులు భర్తీచేస్తామని అసెంబ్లీలో ప్రకటించి, ఎన్నికల ముందు 5089 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. పోస్టులు పెంచాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నా స్పందించలేదు ప్రభుత్వం. పరీక్ష తేదీలు కూడా ప్రకటించారు. కానీ ఎన్నికలు రావడంతో ఆ పరీక్షలు వాయిదా వేశారు. అయితే ఈ పరీక్షలు ఫిబ్రవరీలో నిర్వహించాలని అనుకున్నా తేదీలు ఇంతవరకూ ఖరారు కాలేదు. పైగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో డీఎస్సీ పరీక్షలపై డైలామా నెలకొంది.
అప్పట్లో కాంగ్రెస్ నాయకులు మెగా డీఎస్సీ వేయాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలా డిమాండ్ చేసిన వారిలో ప్రస్తుత సీఎం కూడా ఉన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడంతో 5089 పోస్టులకు వెలువడ్డ నోటిఫికేషన్ ఆపాలని మిగత 20 వేల టీచర్ పోస్టులు జత చేసి మెగా డీఎస్సీ జారీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. 5089 పోస్టులకే పరీక్షలు పూర్తి చేసి, నియమాక ప్రక్రియ పూర్తి చేయాలంటే కోర్టు కేసులు...ప్రక్రియలో జాప్యం వల్ల మినిమం సంవత్సరం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇంకో నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తెలియదు కాబట్టి ఇప్పుడే ఇదే నోటిఫికేషన్‌కు పోస్టులు జత చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాగూ 1.75 లక్షల మంది అభ్యర్థులు ఫీజులు చెల్లించారు. రీ నోటిఫికేషన్ జారీ చేస్తే అప్పుడు అప్లై చేయని అభ్యర్థులు కూడా అప్లై చేస్తారనీ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని వాళ్ల ఎన్నికల హామీ కూడా నెరవేర్చినట్టు ఉంటుందని అభ్యర్థులు, విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
రావుల రామ్మోహన్ రెడ్డి
డి.ఎడ్, బి.ఎడ్ అభ్యర్థుల సంఘం
93930 59998