- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధ్యాపకుల నియామకాలు చేపట్టాలి!
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో నిరంతరం ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఇందుకు కారణం ఉద్యోగ నియామకాలు, నుండి పాలన అంశా లలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం, నిధుల కొరత, మౌలిక వనరుల సమస్యలు రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలలోనూ ఉన్నాయి. అయితే వాటిని అధిగమించడలో ప్రస్తుత ఉపకులపతులు అధికారులు కొంత వరకు విఫలం అయ్యారని మేధావులు అనుకుంటున్నారు. వర్సిటీల్లో ఉన్న పెండింగ్ కేసులు, సమస్యలని పరిష్కారం కొరకై ఉత్తమ పద్దతులని స్వీకరిస్తే దాదాపు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. యూనివర్సిటీలలో ప్రధానంగా సరిపోను అధ్యాపకుల కొరత వేధిస్తోంది. అందుకే కొత్త నియామకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నూతన ఉపకులపతులు నియామక ప్రక్రియ పూర్తి చేసి, ఎన్నికల తర్వాత అన్ని యూనివర్సిటీలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకులను భర్తీ చేయాలి.
ఉన్నత ప్రమాణాలు కోల్పోకుండా చూడాలి..!
దేశంలో అన్ని యూనివర్సిటీలలో సజావుగా నియామకాలు చేస్తున్నారు వారికి లేని సాంకేతిక, న్యాయ సమస్యలు మన రాష్ట్రంలో ఎందుకు వస్తున్నాయో..? ప్రభుత్వం ఆలోచించి ఎటువంటి సమస్యలు రాకుండా పారదర్శకంగా అధ్యాపకుల నియమాలకు చేపట్టాలి. దేశంలో బోర్డు విధానం ద్వారా కాకుండా అన్ని యూనివర్సిటీలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలు ద్వారానే నియామకాలు చేస్తున్నాయి. ఆ విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. కనీసం ఈ ఏడాది అయిన యూనివర్సిటీలలో అధ్యాపకుల నియామకాలు చేపట్టి ప్రభుత్వం యూనివర్సిటీల గుర్తింపు, ఉన్నత ప్రమాణాలు కోల్పోకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో నూతన యూనివర్సిటీలని వచ్చే విద్యా సంవత్సరంలో నెలకొల్పాలి. దానివల్ల ఆ జిల్లాల విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువవుతుంది. విద్యాశాఖకు ఒక ప్రత్యేక మంత్రిని కూడా నియమిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
-డా. శ్రవణ్ కుమార్ కందగట్ల