- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వం వర్సెస్ ఈసీ… మాటల్లేవ్!
ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ కమిషన్ వర్సెస్ ప్రభుత్వం యుద్ధం నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్తుతానికి నిలిపేస్తున్నామని, ఆరు వారాల తరువాత పోలింగ్ నిర్వహిస్తామని, ఏకగ్రీవాలన్నీ చెల్లుబాటవుతాయంటూ ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఏమాత్రం ఊహించని రాష్ట్ర ప్రభుత్వం ఈసీ నిర్ణయంతో నిశ్చేష్టురాలైంది. వెంటనే తేరుకుని ఈసీపై తీవ్ర విమర్శలు చేసింది.
అనంతరం ఈసీపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌కు ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఎన్నికలను యధావిధిగా నిర్వహించాలని కోరుతూ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వివరణ కోరడంతో ఈసీ రాజ్‌భవన్‌కు చేరకుని ప్రత్యేక అధికారాలు ఉపయోగించడానికి గత కారణాలను వివరించారు. సుమారు గంటపాటు గవర్నర్‌తో ఈసీ చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం ఎన్నికలు కొనసాగిస్తామని ఈసీ చెబుతారని అంతా భావించారు. అయితే ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం స్పందించకుండా కార్యాలయానికి వెళ్లిపోయారు. దీంతో మరోసారి ప్రభుత్వం అవాక్కైంది.
ఇక లాభం లేదని భావించిన ప్రభుత్వం ఎన్నికలు యధావిధిగా నిర్వహించేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అక్కడ ఈ కేసు విచారణకు రాలేదు. కరోనా నేపథ్యంలో అత్యవసర కేసులను మాత్రమే సుప్రీంకోర్టు విచారిస్తోంది. దీంతో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై ఆదేశాలు ఆలస్యమేనని అర్ధమవుతోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో చిత్తూరు, గుంటూరు కలెక్టర్లతో పాటు ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలను బదిలీ చేయాలని, మాచర్ల సీఐని సస్పెండ్ చెయ్యాలని ఈసీ ఆదేశాలు జారీ చేశారు. ఆరు వారాల వాయిదా తరువాత మార్చాల్సిన అవసరం లేదని భావించిందో ఏమో కానీ… వారి బదిలీకి ఆదేశాలివ్వలేదు.
మరోవైపు సీఎస్ నీలం సాహ్నీ లేఖకు సమాధానమిస్తూ… వాయిదా విషయంలో పునరాలోచన లేదని తేల్చిచెప్పారు. దీంతో ఎన్నికలు ఆరువారాలు వాయిదా పడడంలో ఎలాంటి సందేహం లేనట్టు స్పష్టమవుతోంది. ఉగాదికి రాష్ట్ర ప్రభుత్వం 26 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి సన్నాహాలు చేసింది. ఈసీ నిర్ణయంతో ఇది ప్రభావితం కానుంది.
Tags: sec, election commissioner, ramesh kumar, ysrcp, jagan, neelam sahni,