- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్‌లో వరద సాయానికి బ్రేక్
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్‌లో వరద సాయానికి బ్రేక్ పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వరద సాయం నిలిపివేయాలని బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండటం వల్ల మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకోవద్దని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పథకాన్ని యథావిధిగా కొనసాగించవచ్చని స్టేట్ ఎలక్షన్ కమిషన్ సూచించింది. నెలరోజుల క్రితం హైదరాబాద్‌లో భారీ వర్షానికి వేలాది ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈక్రమంలోనే బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.550కోట్లు విడుదల చేసింది. అప్పటినుంచి బాధితులకు సాయం అందజేస్తూ వస్తున్నా అసలు బాధితులకు అందడం లేదని ఫిర్యాదు రావడంతో పాటు పలువురు జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. ఈక్రమంలోనే మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో బాధితులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో వరద సాయానికి ఈసీ బ్రేక్ వేసింది.