ఇరాన్-టర్కీ సరిహద్దుల్లో భూకంపం

by vinod kumar |   ( Updated:2023-03-28 12:55:16.0  )
ఇరాన్-టర్కీ సరిహద్దుల్లో భూకంపం
X

ఇరాన్-టర్కీ సరిహద్దు ప్రాంతంలో భూకంపం బెంబేలెత్తించింది. రిక్టర్ స్కేలుపై 5.7 పాయింట్లుగా భూ ప్రకంపనలు నమోదయ్యాయని అక్కడి అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. చాలా చోట్ల భవనాలు, ఇండ్లు కూలిపోయాయి. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారో అన్నది తెలియలేదు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Read also..

కుప్పకూలిన యుద్ధవిమానం

Advertisement

Next Story

Most Viewed