E-CET పరీక్ష ఫలితాలు విడుదల

by Shyam |   ( Updated:2021-08-18 01:46:14.0  )
E-CET పరీక్ష ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ఈ సెట్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్, బీ ఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలో 95.16 శాతం విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆయన స్పష్టం చేశారు. సుమారు 24 వేల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు.

అలాగే అధికారిక వెబ్ సైట్ ecet tsche.ac.in నుంచి విద్యార్థులు తమ ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. 24వ తేదీన ఈసెట్ ప్రవేశాల కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. 24వ తేదీ నుంచి 28 వరకు స్లాట్ బుకింగ్, 26వ తేదీ నుంచి 31 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 02వ తేదీన ఈసెట్ అభ్యర్థులకు అధికారులు సీట్లు కేటాయించనున్నారు. సెప్టెంబర్ 02వ తేదీ నుంచి 07వ తేదీ వరకు ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక వచ్చేనెల 13వ తేదీ నుంచి ఈసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. సెప్టెంబర్‌ 18న స్పాట్‌ అడ్మిషన్స్‌కు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తారు.

Advertisement

Next Story