- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వచ్చే ఏడాది నుంచి వారానికి నాలుగున్నర రోజులు మాత్రమే డ్యూటీ
దుబాయ్: ఉద్యోగుల పని దినాల విషయంలో యూనిటెడ్ అరబ్ ఎమిరెట్స్(యూఏఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నాలుగున్నర రోజులే పనిదినాలుగా చేస్తున్నట్లు మంగళవారం అధికారులు ప్రకటించారు. అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరించే దిశగా శని, ఆదివారాలను పూర్తి సెలవు దినాలుగా మార్చినట్లు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆదివారం వరకు సెలవుగా పరిగణిస్తామని పేర్కొన్నారు. ఈ మార్పులు కొత్త ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు.
ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవి వర్తిస్తాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం అయ్యేందుకు ఈ విధానం అమలు చేస్తుందని వార్త సంస్థ వామ్ పేర్కొంది. కాగా ఐదు రోజుల పనిదినాల కన్నా తక్కువ పనిదినాలు కల్పించిన తొలి దేశంగా యూఏఈ నిలిచిందని వెల్లడించింది. ‘ఆర్ధిక కోణంలో కొత్త పని వారాలు ప్రపంచ ఆర్థిక పటంలో దేశం వ్యూహాత్మక స్థితిని ప్రతిబింబిస్తాయి. ప్రపంచ మార్కెట్లతో యూఏఈని సమతూకం చేస్తుంది. అంతేకాకుండా ఇది వారాంతాన్ని అనుసరించే దేశాలతో ఆర్థిక, వాణిజ్యం మరియు ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తుంది. బలమైన అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు వేలాది యూఏఈ ఆధారిత, బహుళజాతి కంపెనీలకు అవకాశాలను కల్పిస్తుంది’ అని మీడియా వెల్లడించింది. 2006 వరకు యూఏఈలో గురు, శుక్రవారాలను వారాంతాలుగా ఉండేవి. తర్వాత ప్రైవేట్ సెక్టార్ తోడవ్వడంతో శుక్ర, శనివారాలకు మార్చారు.
- Tags
- holidays.