పారిశుధ్య కార్మికులకు దసరా కానుక..

by Aamani |   ( Updated:2021-10-14 07:31:14.0  )
పారిశుధ్య కార్మికులకు దసరా కానుక..
X

దిశ ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లోని సుర్జాపూర్ గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుల కు గురువారం రోజున దసరా పండగ కానుకగా వారికి నిత్యావసర సరకులతో కొత్త బట్టలు గ్రామ సర్పంచ్ చెప్పల అనూరాధ వెంకట్రాజం, ఉప సర్పంచ్ అనుప హరీష్ తమ స్వంత ఖర్చులతో వారికి అందచేశారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ మండల ఈవో పిఆర్డీ చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల ను గుర్తించి వారికి దసరా పండగ వేళ లో కొత్త బట్టలతో నిత్యావసర సరుకుల అందజేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తర్వాత సర్పంచ్, ఉపసర్పంచ్ లు చేస్తున్న మంచి పనులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆర్షథ్, కరొబార్ ప్రసన్న, సుద్దాల మహిపల్, సుద్దాల సాగర్,రేండ్ల కిషన్, చేపురి శంకర్,గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed