- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్లాస్టిక్ బ్యాగ్ రీసైక్లింగ్‌తో ‘ట్రెండీ స్నీకర్స్’
దిశ, ఫీచర్స్: ప్లాస్టిక్ వినియోగం కొన్నేళ్లుగా ఊహించని రీతిలో పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలు దాదాపు 13 కోట్ల టన్నుల మేర పోగవుతుండగా, సగటున 5 ట్రిలియన్ ప్లాస్టిక్ సంచులను ఉపయోగిస్తున్నాం. ఈ తరహా ప్లాస్టిక్ వినియోగంలో ఆస్ట్రేలియా ముందు వరసలో ఉంది. అక్కడ ఒక్కో వ్యక్తి యావరేజ్‌గా ఏడాదికి 59 కిలోల వ్యర్థాలకు కారణమవుతుండగా.. అమెరికాలో సగటున 53 కిలోలు, దక్షిణాకొరియా & యూకేలో 44 కిలోలు, జపాన్‌లో 37 కేజీలుగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇక పాండమిక్‌లో ఈ లెక్కలు పెరిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే చాలా మంది ప్లాస్టిక్ తీవ్రతను తగ్గించేందుకు కృషి చేస్తుండగా.. అమిటీ విశ్వవిద్యాలయానికి చెందిన 21 ఏళ్ల మాజీ విద్యార్థి ఆశయ్ భావే కూడా ఈ దిశగా తన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. సముద్ర ప్లాస్టిక్ వ్యర్థాల్లో 14% మాత్రమే రీసైకిల్ అవుతున్నట్లు తెలుసుకున్న ఈ భారత సంతతి కుర్రాడు.. ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా స్నీకర్స్ రూపొందిస్తున్నాడు.
ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించాలనే ఉద్దేశంతో ముంబైకి చెందిన విజువల్ ఆర్టిస్ట్, ఇండస్ట్రియల్ డిజైనర్ ఆశయ్ భావే.. దుబాయ్ కేంద్రంగా ‘తైలీ’(@thaely.inc)ని ప్రారంభించాడు. ఈ కంపెనీ వ్యర్థ ప్లాస్టిక్ సంచుల నుంచి రూపొందిన క్లాత్ ఉపయోగించి బూట్లను ఉత్పత్తి చేస్తోంది. ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్‌గా మార్కెట్లోకి వచ్చిన ఈ బ్రాండ్ మంచి స్పందన అందుకుంటోంది. కాగా ఈ ఆలోచనకు గాను ఆశయ్.. యురేకా స్టార్టప్ అవార్డు గెలుచుకోవడం విశేషం.
4 ప్లాస్టిక్ సీసాలతో రీయూజబుల్ షాపింగ్ టోట్..
‘ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలు నన్ను ఆలోచనలో పడేశాయి. ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏదైనా చేద్దామనుకుంటున్న తరుణంలో సురక్షితమైన పాదరక్షలను సృష్టించాలనుకున్నాను. 2017 చివర్లో ప్రొటోటైప్ తయారుచేసి, ఇండియాకు వెళ్లాను. ముంబైలోని ఓ డిజైనర్‌కు నా ప్లాన్ చెప్పి షూ తయారుచేయించాను. మొత్తంగా 15 ప్లాస్టిక్ సంచులు, 22 సీసాలతో పాటు పారిశ్రామిక రబ్బరు వ్యర్థాలతో ఒక జత బూట్లను రూపొందించవచ్చు. ఇందులో ఉపయోగించే జిగురు సహా ఇతర భాగాలన్నీ 100% వేగన్. గురుగ్రామ్ చుట్టుపక్కన హౌసింగ్ కాంప్లెక్స్, కార్యాలయాలు, దుకాణాల నుంచి వ్యర్థ ప్లాస్టిక్ సంచులను సేకరిస్తున్నాం. ఇక 4 ప్లాస్టిక్ సీసాలతో రీసైకిల్ చేసిన కాగితం నుంచి తయారైన రీయూజబుల్ షాపింగ్ టోట్‌లో షూను ప్యాక్ చేస్తాం. తులసి విత్తనాలతో పొందుపరచబడే ఈ బాక్స్‌ను భూమిలో పెడితే దాన్నుంచి 10 రోజుల్లోనే తులసి మొక్క పెరుగుతుంది’ – ఆశయ్ భావే