- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మ్యాచ్ డ్రా ఇష్టం ఉండదు: కోహ్లి
దిశ, స్పోర్ట్స్: తాను ఎప్పుడూ విజయం గురించే ఆలోచిస్తానని, ఆ విషయంలో రాజీ పడటం తనకు ఏ మాత్రం ఇష్టం ఉండదని కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. ఓ టీవీ కార్యక్రమంలో క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌తో కలసి కోహ్లి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ టెస్టు మ్యాచ్‌ను డ్రాగా ముగించడం తనకు ఇష్టం ఉండదన్నాడు. చివరి రోజు ప్రత్యర్థి 300 పరుగుల లక్ష్యం నిర్థేశిస్తే సెషన్‌కు 100 పరుగుల కోసం ప్రయత్నిద్దామని ఆటగాళ్లకు చెబుతాను. ఒకవేళ తొలి సెషన్‌లో 80 పరుగుల మాత్రమే చేయగలిగితే చివరి సెషన్‌లో 120 చేద్దామని చెబుతాను. డ్రా కోసం ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించను. పరిస్థితి చేయిదాటిపోతే తప్ప డ్రా గురించి ఆలోచించను. ఒక ఆటగాడి మనసులో ఓడిపోతున్నామనే భయమే అత్యంత ప్రతికూల అంశమని కొహ్లీ అన్నాడు. ఏ గేమ్‌లో అయినా మ్యాచ్‌ను మలుపు తిప్పే సందర్భం ఒక్కటైనా వస్తుందని, అప్పుడు ఆటగాళ్లే వావ్ అంటారని అన్నాడు.