‘పేదలకు కళ్యాణలక్ష్మితో పాటు డబుల్ బెడ్ రూమ్..’

by Sridhar Babu |
‘పేదలకు కళ్యాణలక్ష్మితో పాటు డబుల్ బెడ్ రూమ్..’
X

దిశ, జగిత్యాల: బంగారు తెలంగాణ వద్దు.. అన్ని వర్గాలకు బతుకుదెరువు చూపాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జగిత్యాలలోని ఇందిరా భవన్‌లో జీవన్ రెడ్డి.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనని గత ఎన్నికల్లో చెప్పిన మాదిరిగానే.. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో కూడా ఓట్లు అడగొద్దంటూ ప్రతిజ్ఞ చేయాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళితబంధు మంచి స్కీమ్ అని చెబుతూనే.. హుజురాబాద్‌ ఉపఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారని విమర్శించారు. కొత్తగా పెళ్లయిన వారికి కళ్యాణలక్ష్మితో డబుల్ బెడ్‌ రూమ్ ఇండ్లు కూడా ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed