- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జూన్ 16న ఐపీఓకు రానున్న డొడ్ల డెయిరీ
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ డొడ్ల డెయిరీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ)కు రానుంది. ఈ 16 నుంచి 18 వరకు ఐపీఓ అందుబాటులో ఉండనున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీనికోసం గతంలో రెగ్యులేటరీ సెబీకి దాఖలు చేసిన ఐపీఓ వివరాలను కంపెనీ వివరించింది. ఇష్యూ ప్రైస్ బాండ్ ధరను రూ. 421-428 మధ్య నిర్ణయిస్తున్నట్టు వెల్లడించింది. ఈ ఐపీఓ ద్వారా డొడ్ల డెయిరీ రూ. 50 కోట్ల నిధులను సమీకరించనుంది.
ప్రమోటర్లు, పెట్టుబడిదారులకు చెందిన కోటికి పైగా ఈక్విటీ షేర్లు విక్రయానికి రానున్నాయి. ఐపీఓ ద్వారా సేకరించే నిధులను రుణాల చెల్లింపు, మూలధన వ్యయానికి వినియోగించనున్నట్టు సంస్థ పేర్కొంది. దక్షిణ భారత్‌లోనే ప్రైవేట్ డెయిరీల్లో ఒకటైన డొడ్ల డెయిరీ తెలంగాణ, ఆంద్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలలో పాల ఉత్పత్తుల వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఈ సంస్థ రోజుకు 10 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు సంస్థ వివరించింది.