- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యార్థినిపై అత్యాచారయత్నమే :డా.రణధీర్ రెడ్డి
దిశ ప్రతినిధి, మేడ్చల్: హైదరాబాద్ ఘట్‌కేసర్ ఘటనలో విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని క్యూర్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. బాధితురాలికి సీనియర్ గైనకాలజిస్ట్ అన్ని వైద్య పరీక్షలు చేశారని, కేవలం అత్యాచార ప్రయత్నమే జరిగిందని డాక్టర్ రణధీర్ రెడ్డి వెల్లడించారు. విద్యార్థినిపై రాడ్‌తో దాడి చేయడం వల్ల కాలుకు గాయమైందని చికిత్స చేస్తున్నామని చెప్పారు. బాధితురాలు నిందితుల ఫొటోలను గుర్తించడంతో రాచకొండ పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ఘట్‌కేసర్‌లో కాలేజీ నుంచి ఇంటికెళ్తున్న బి.ఫార్మసీ సెకండ్ ఇయర్ విద్యార్థినిపై బుధవారం ఆటో గ్యాంగ్ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం వద్ద బస్సు దిగిన యువతి.. ఆర్.ఎల్ నగర్ కాలనీలోని ఇంటికెళ్లడానికి ఓ ఆటో ఎక్కింది. యువతి ఒంటరిగా ఉందని కన్నేసిన ఆటో డ్రైవర్… మరో ముగ్గురు స్నేహితులను మార్గ మధ్యలో ఎక్కించుకున్నాడు. అనంతరం దారి మళ్లించి నేరుగా ఘట్‌కేసర్ పరిధిలోని జోడిమెట్ల వద్ద చెట్ల పొదల్లోకి బలవంతంగా లాక్కెళ్లారు. నలుగురు కలిసి అమ్మాయిపై అత్యాచారానికి యత్నించి, బాధితురాలిని రోడ్డు పక్కనే పడేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం నారపల్లిలోని క్యూర్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.