- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మిగిలిపోయిన ఆహారాన్ని వేడిచేసి తింటున్నారా..? జాగ్రత్త!
దిశ, ఫీచర్స్ : ఏదైనా ఆహారం మిగిలిపోతే, మరుసటి రోజు వేడిచేసుకొని తినడం చాలామందికి అలవాటు. కష్టపడి తయారుచేసిన వంటలను వృథా చేయకూడదనే ఉద్దేశమున్నా, అలా రీ హీట్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ఆహార పదార్థాలు ఎక్కువ ముప్పును కలిగిస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.. అవేంటో మీరూ చూడండి.
పాలకూర, పచ్చి కూరగాయలు..
పాలకూరతో పాటు ఏవైనా గ్రీన్ వెజిటేబుల్స్‌తో చేసిన వంట మిగిలిపోతే.. ఆ తర్వాతి రోజు తినడానికి ముందు వేడిచేసుకోకూడదు. ఐరన్ పుష్కలంగా ఉండే పాలకూరను రీహీట్ చేసినపుడు అది ఆక్సీకరణకు గురవుతుంది. ఇలా ఐరన్ ఆక్సీకరణ చెందితే అనేక రోగాలకు కారణమవుతుంది.
అన్నం..
అన్నం వండేందుకు ముందు బియ్యంలో కొన్ని స్పోర్స్(బీజాంశాలు) ఉండే అవకాశం ఉంది. అవి శరీరానికి పెద్దగా హానికరం కాదు కానీ, వండిన అన్నంను గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు నిల్వ ఉంచితే ఈ బీజాంశాలు బ్యాక్టీరియాగా మారతాయి. ఆ తర్వాత ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తే ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు ఎదుర్కొంటారు.
గుడ్లు..
గుడ్లలో చాలా పోషక విలువలు ఉంటాయి. కానీ వాటిని పదేపదే వేడి చేసిప్పుడు క్రమంగా పాడైపోతాయి. అందుకే గుడ్లను ఉడికించిన తర్వాత వీలైనంత త్వరగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ తినడం ఆలస్యమైనా చల్లగా ఉన్నావాటినే తినాలని చెబుతున్నారు. ఎందుకంటే గుడ్లలో లభించే ప్రోటీన్‌లో గల నత్రజనిని వేడిచేస్తే క్యాన్సర్‌కు కారకం కావచ్చు.
చికెన్..
చికెన్ అంటే ఇష్టపడని వారుండరు. అందుకే మిగిలిపోయిన చికెన్‌ను ఫ్రిజ్‌లో పెట్టి, నెక్ట్స్ డే మళ్లీ తినవచ్చని అనుకుంటారు. కానీ చికెన్‌ను మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల అందులోని ప్రొటీన్ కంపోజిషన్ పూర్తిగా చేంజ్ అవుతుంది. అంతేకాదు రీహీట్ చేసిన చికెన్ తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది.
పుట్టగొడుగులు(మష్రూమ్స్)..
పుట్టగొడుగుల(మష్రూమ్స్)ను కూడా వండిన వెంటనే తినాలి. మరుసటి రోజు వరకు నిల్వ చేసుకోకూడదు. ఒకవేళ రీహీట్ చేసి తిన్నట్టయితే అందులోని అనేక మూలకాలు జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తాయి. అందుకే మష్రూమ్ ఐటెమ్‌ను మరోసారి తినాలనుకుంటే, తిరిగి వేడిచేయకుండా తింటేనే మంచిది.