- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరణ్ జోహార్‌పై లేడీ కంటెస్టెంట్ అటాక్

దిశ, సినిమా : బిగ్ బాస్ ఓటీటీ హౌస్‌లో డ్రామా కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్ల మధ్య కెమిస్ట్రీతో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన రియాలిటీ షో.. తాజా ఘటనతో కొంచెం వేడెక్కింది. కంటెస్టెంట్ దివ్య అగర్వాల్‌ను హోస్ట్, ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ మందలించాడు. తనతో జాగ్రత్తగా, రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడాలని.. వాదించవద్దని సూచించాడు. దీంతో ఆ ఎపిసోడ్‌లో కన్నీటి పర్యంతమైన దివ్య.. తాజాగా ఆ సంఘటనను గుర్తుచేసుకుంది. కరణ్ తన గురించి చెప్పిన విషయాలు బాధించాయని, ఈ సిచ్యువేషన్‌లో తనెందుకు కామ్‌గా ఉండాలి? అంటూ కో-కంటెస్టెంట్ అక్షర సింగ్‌తో చెప్పుకుంది. ‘నువ్వు బాలీవుడ్ కింగ్ అని, ఏదిచెప్పినా అందరూ వింటారని అనుకుంటున్నావా? నా గురించి అలాంటి విషయాలు ఎలా చెప్పగలరు? అంటూ కరణ్‌ను ప్రశ్నించింది. నచ్చకపోతే షో నుంచి వెళ్లిపోవాలన్న కరణ్ మాటలకు స్పందిస్తూ.. తను ఆర్టిస్ట్‌నని, ఇక్కడ కాకపోతే మరోచోట చాన్స్ దొరుకుతుందని చెప్పింది.