- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెండో పెళ్లి చేసుకో అన్నందుకు యువతి దారుణం
దిశ, కారేపల్లి : ఒంటరిగా ఉంటున్న యువతిని పెళ్లి చేసుకోకుండా ఇంకెన్ని రోజులు ఉంటావని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందింది. ఈ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. పేరుపల్లికి చెందిన బండారి అశ్విని(22)కు 2019లో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో వివాహం అయింది.
ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావటంతో అశ్విని భర్త నుంచి విడిపోయి పేరుపల్లిలోని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు అశ్వినిని మరో వివాహం చేసుకోమని కోరారు. పెండ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతీసారి అశ్విని నిరాకరిస్తూ వస్తోంది. ఈనెల 12వ తేదిన పెండ్లి విషయమై అశ్వినిని తల్లిదండ్రులు గట్టిగా నిలదీశారు. దీంతో మనస్ధాపానికి గురైన యువతి ఇంట్లో గడ్డి మందు తాగింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆమెను ఖమ్మంలోని ప్రయివేట్ అసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే పరిస్ధితి విషమించి ఈరోజు మృతి చెందింది. మృతురాలి తండ్రి బండారి రామయ్య ఫిర్యాదు మేరకు కారేపల్లి ఏఎస్సై కృష్ణ ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.