వారిని గుర్తించి వైద్య పరీక్షలు

by Shyam |

దిశ, రంగారెడ్డి : ఢిల్లీలోని నిజామొద్దీన్ తబ్లిక్ జమాత్‎లో పాల్గొని రంగారెడ్డిలోని పలుప్రాంతాలకు విచ్చేసిన వారిని గుర్తించి.. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. జమాతేలో పాల్గొని జిల్లాకు వచ్చిన ఈ జాబితాను అనుసరించి వారు ఏ మండలం, ఏ గ్రామానికి చెందినవారు, వారికి వైద్య పరీక్షలు జరిగాయా లేదా, వారి కుటుంబ సభ్యుల వివరాలను రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు సేకరిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులకు ఎవరికైనా దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే.. ఐసోలేషన్‌కు తరలించేందుకు తగు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంతే కాకుండా వారిలో 55 సంవత్సరాలు పైబడిన వారు ఉంటే నేరుగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించాలని కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా వివరాలను అధికారులకు వెల్లడించాలని ఆయన సూచించారు. దీనికోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్లు 040 3230811 /23230813 /23230814 /23230817, టోల్ ఫ్రీ కోసం 18004250817 నెంబర్లను సంప్రదించాలని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.

Tags: collector, Amoy Kumar, Nizamoddin, Tablik Jamaat, suspects, rangareddy

Advertisement

Next Story

Most Viewed