కేటీఆర్ బర్త్ డే.. ప్రైవేట్ టీచ‌ర్ల‌కు సాయం

by Sridhar Babu |   ( Updated:2020-07-24 07:22:01.0  )
కేటీఆర్ బర్త్ డే.. ప్రైవేట్ టీచ‌ర్ల‌కు సాయం
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఖ‌మ్మంలో శుక్ర‌వారం సుడా డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్ పేద ప్రైవేటు టీచ‌ర్ల‌కు నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేశారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భలుతుండ‌టంతో పాఠ‌శాల‌లు తెరుచుకోక‌పోవ‌డంతో ఉపాధి కోల్పోయిన 50 పేద ప్రైవేటు టీచర్ల కుటుంబాలకు బియ్యం, నూనె , కందిపప్పు, ఉల్లిగడ్డలు,కారం వంటి నిత్యావసర సరుకుల‌ను అంద‌జేశారు. దీంతో అందరూ ఆయన్ను అభినందించారు.

Advertisement

Next Story