- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అధికార పార్టీలో హుజురాబాద్ బైపోల్ టెన్షన్.. మరో పథకానికి శ్రీకారం
దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ నుంచే సెకండ్ ఫేజ్ గొర్రెల పంపిణీ చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తున్నది. ఉప ఎన్నికలో లబ్ధిపొందేందుకు ప్రభుత్వం స్కెచ్ వేస్తుంది. ఇందుకు సంబంధించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే పంపిణీ తేదీని, ప్రాంతాన్ని ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా మొదటి విడుతలో ఇంకా 14వేల యూనిట్ల గొర్రెల పంపిణీ పెండింగ్‌లోనే ఉన్నాయి. పెంచిన ధరలను పెండింగ్ లబ్ధిదారులకు అమలు పరచడంతో గొర్రెల కాపర్ల సంఘం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో లబ్ధిదారునిపై రూ.12,500 అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉప ఎన్నికలు ఉండటంతో సీఎం కేసీఆర్ దళితులు, వృత్తిదారులకు వరలా జల్లు కురిపిస్తున్నారు. ఓటర్లను ఆకర్శిచేందుకే పథకాలు అమలు పరుస్తున్నామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. దళితుల కోసం దళిత బంధును ప్రకటించిన ప్రభుత్వం గొర్రెల కాపర్ల ఓట్లను సొంతం చేసుకునేందుకు రెండవ విడత గొర్రెల పంపిణీని ప్రకటించారు. హుజూరాబాద్ కేంద్రంగానే ఈ పథకాల అమలుకు శ్రీకారం చుడుతున్నారు.
హుజురాబాద్ నుంచి సెకండ్ ఫేజ్ గొర్రెల పంపిణీ..
రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని హుజూరాబాద్ నుంచి అమలు చేసేందుకు సీఎం కేసిఆర్ ఏర్పాట్లను చేపట్టారు. ఇందు కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే హూజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించి గొర్రెలు పంపిణీ చేసేందుకు పలు ప్రాంతాలను పరిశీలించారు. అన్ని ఏర్పాట్లను చేపట్టి త్వరలోనే గొర్రెల పంపిణీ ముహూర్తాన్ని కూడా ప్రకటించనున్నారు. ఉప ఎన్నికలు తర్వలో నిర్వహించే అవకాశం ఉండటంతో ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే పథకాన్ని అమలు చేయాలని ఆలోచిస్తున్నారు.
ఉప ఎన్నికల కోసం ప్రభుత్వం ఆడుతున్న డ్రామా..
హుజురాబాద్ ఉప ఎన్నికలు ఉన్నందుకే ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చింది. ఎన్నికల ముందు హడావిడి చేపట్టి హుజురాబాద్ నియోజకవర్గంలో గొర్రెలను పంపిణీ చేయనున్నారు. ఎన్నికలు ముగిసాక తిరిగి సాధారణ ఎన్నికలు ఆసన్నమైనప్పుడు మళ్లీ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మొదటి విడుత లబ్ధిదారులకు పెంచిన ధరలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. -ఉడుత రవీందర్, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు