పువ్వాడ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో రేపు నిత్యావ‌స‌రాల పంపిణీ

by Sridhar Babu |
పువ్వాడ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో రేపు నిత్యావ‌స‌రాల పంపిణీ
X

దిశ‌, ఖ‌మ్మం: పట్టణ కార్పొరేషన్ పరిధిలోని 10వేల మంది నిరుపేదలకు ఆదివారం నిత్యావసర సరుకులు అందజేయనున్నట్టు పువ్వాడ ఫౌండేషన్ చైర్మన్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. మ‌మ‌త డెంట‌ల్ క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 19న తన పుట్టిన రోజు సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వేల నిత్యావసర సరుకుల కిట్లు, 10వేల శానిటైజర్లు, 3రకాల కూరగాయలు పంపిణీ చేయనున్న‌ట్టు తెలిపారు. ఈ మొత్తం సరుకులను రెవెన్యూ శాఖ ద్వారా సామాజిక దూరం పాటిస్తూ పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు సరుకులను కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతికి అందజేశారు. అలాగే, తనకు శుభాకాంక్షలు తెలపడానికి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఫోన్, వాట్సాప్ ద్వారానే తెలపాలని కోరారు. మార్చి 3నుంచి 17వరకు జిల్లా వ్యాప్తంగా 6957 మంది రైతుల నుంచి 61వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సివిల్‌స‌ప్లై శాఖ సేక‌రించింద‌ని తెలిపారు. మొదటి విడతగా 282 మంది రైతులకు రూ.4కోట్ల న‌గదును ప్ర‌భుత్వం విడుద‌ల చేసింద‌ని చెప్పారు. ఇందుకు సంబంధించిన చెక్కును కలెక్టర్ కర్ణన్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర రావుకు అందజేశారు. న‌గ‌దును రైతుల ఖాతాలో నేరుగా జమ చేయనున్నామని మంత్రి వివరించారు.

Tags: Distribution, commodities, Puvvada Foundation, minister ajay kumar,kmm

Advertisement

Next Story