షాకింగ్: మరోసారి తెరపైకి ‘దిశ’ హత్యాచార ఘటన.. రకుల్, రవితేజపై కేసు నమోదు

by Anukaran |   ( Updated:2021-09-05 04:47:21.0  )
షాకింగ్: మరోసారి తెరపైకి ‘దిశ’ హత్యాచార ఘటన.. రకుల్, రవితేజపై కేసు నమోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమ వివాదాల మధ్యే నడుస్తోంది. పోర్నోగ్రఫీ కేసులు, డ్రగ్ కేసులు అంటూ సినీ ప్రముఖులు వివాదాలలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఇక తాజాగా టాలీవుడ్ డ్రగ్ కేసు మరోసారి తెరపైకి వచ్చి కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులోనే సతమతమవుతున్న సినీ ప్రముఖులపై మరో కేసు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. నిబంధనల ప్రకారం హత్యాచారానికి గురైన మహిళల పేర్లను, ఫొటోలను బహిర్గతం చేయడం నేరం.. అయితే దీనిని ఉపక్రమించారని సినీ నటులపై కేసు నమోదైంది. 2019లో తెలుగు రాష్ట్రాల్లో ‘దిశ’ హత్యాచార ఘటన ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ ఘటనపై అప్పట్లో సినీ, రాజకీయ ప్రముఖులు సైతం తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే నిబంధనల ప్రకారం హత్యాచారానికి గురైన మహిళల పేర్లను, ఫొటోలను బహిర్గతం చేయకూడదు.

కానీ, ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ నటుడు రవితేజ, నటి రకుల్​ ప్రీత్ సింగ్​ సహా 38 మంది ప్రముఖులు ఆమె పేరును, ఫోటోను సామాజిక మాధ్యమాలల్లో తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సోషల్ మీడియాలో ఆమె పేరును బహిర్గతంగా చెప్పినందుకు ప్రముఖులను అరెస్ట్ చేయాలని ఢిల్లీ తీస్ హజారీ కోర్టులో న్యాయవాది గౌరవ్ గులాటీ పిటిషన్​వేశారు. అంతేకాకుండా సెక్షన్ 228ఏ కింద ప్రముఖులపై కేసు నమోదు చేయాలని సబ్జీ మండీ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్​గన్, అభిషేక్ బచ్చన్, ఫరాన్ అక్తర్, అనుపమ్ ఖేర్ సహా టాలీవుడ్ నటులు రవితేజ, అల్లు శిరీష్, నటి ఛార్మి పేర్లను గౌరవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరితో పాటు హర్బజన్ సింగ్, శిఖర్ ధావన్, సైనా నెహ్వాల్ పై కూడా కేసు నమోదు చేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed