- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్ : ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్..
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ త్రినగరిలో సాగుతున్న అక్రమ ఇసుక దందాపై మంగళవారం దిశ మీడియాలో వచ్చిన కథనాలకు పోలీస్ అధికారులు స్పందించారు. ఇసుక మాఫియాపై కొరడా ఝులిపిస్తున్నారు. మంగళవారం ఉదయం టీచర్స్ కాలనీ- ఫేజ్1, ఫేజ్-2 లో కనిపించిన వందలాది ఇసుక ట్రాక్టర్లు బుధవారం ఉదయం ఒక్కటంటే ఒక్కటీ కూడా కానరాకపోవడం గమనార్హం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సిటీలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాకు పోలీసు అధికారుల సహకారంపై కమిషనర్ ప్రమోద్ కుమార్ సీరియస్ అయ్యారని సమాచారం. ఇసుక రవాణాను, అమ్మకాలను అడ్డుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిసింది. ఫలితంగానే రవాణాకు అడ్డుకట్ట పడినట్లుగా తెలుస్తోంది.
ఇసుక మాఫియా ఆగడాలపై దిశ మీడియాలో వచ్చిన కథనం అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీసింది. మంగళవారం ఉదయం నుంచే తాజా, మాజీ కార్పొరేటర్లు ఇసుక వ్యాపారులతో మంతనాల్లో మునిగినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల పాటు దందాకు బ్రేకు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇసుక మాఫియాతో కొంతమంది ప్రజాప్రతినిధులకు సంబంధాలు ఉండటమే ఇందుకు కారణం. మాఫియా అందించే మామూళ్లకు సలాం కొడుతూ రవాణాకు, అమ్మకాలకు సహకరిస్తున్నారు. కాసులు ముడుతుండటంతో పోలీసులు కూడా ఈ వ్యవహరానికి దూరంగా ఉంటూ వచ్చారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీస్ కమిషనర్ సీరియస్ కావడంతో సదరు అధికారులు అలెర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇసుక మాఫియాపై పోలీస్ శాఖ నియంత్రణ చర్యలు తాత్కాలికమేనా?.. మళ్లీ మాఫియాకు అనధికారికంగా సహకరిస్తారా?అన్నది వేచి చూడాలి.