బ్యాంకుల ప్రైవేటీకరణపై చర్చలు కొనసాగుతున్నాయ్

by Harish |
banks
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వంలో చర్చలు జరుపుతున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, ఆర్‌బీఐ విధానాలు బలమైన మూలధన వ్యయంతో కూడిన బ్యాంకింగ్ రంగం, నైతిక విలువలు కలిగిన కార్యకలాపాలకే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. బ్యాంకుల స్థితిగతులపై మాట్లాడిన ఆయన, బ్యాంకుల ముఖ్యంగా నిరర్ధక ఆస్తుల భారం ఎక్కువగా ఉందన్నారు. కరోనా వైరస్ వల్ల ఇది మరింత పెరుగుతుందని, బ్యాంకింగ్ రంగాన్ని గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు దాస్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక కార్యకలాపాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయన్నారు. అలాగే, 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ 10.5 శాతం వృద్ధి అంచనాను అలాగే కొనసాగిస్తామని చెప్పారు. ఆర్థిక, ధరల స్థిరత్వాన్ని కాపాడుతూ ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టనున్నట్టు శక్తికాంత దాస్ వెల్లడించారు.

Advertisement

Next Story