- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందుబాబులకు గుడ్ న్యూస్.. టీకా తీసుకుంటే మద్యంపై భారీ డిస్కౌంట్
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, కరోనా వ్యాప్తిని నివారించేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు ప్రజలను కోరుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 100 కోట్ల జనాభాకు పైగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇంకా టీకా తీసుకోని వారిపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెంచాయి. పలు చోట్ల ప్రజలు టీకా తీసుకునేందుకు ఇంకా ఆసక్తి చూపడం లేదు. చాలామంది ఒక డోసు టీకాకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌కు చెందిన అధికారులు టీకా పంపిణీ విస్తృతం చేసేందుకు వినూత్న ప్రయత్నం చేపట్టారు. రెండో డోసు టీకా తీసుకున్న వారికి మద్యం సీసాలపై 10 శాతం డిస్కౌంట్ఇప్పిస్తామని మందసుర్ జిల్లా అధికారులు ఆఫర్ ప్రకటించారు.
అయితే బుధవారం మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ఎక్కువమంది రెండో డోసు తీసుకునేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. తాము ప్రకటించిన ఆఫర్‌కు మంచి స్పందన లభిస్తే భవిష్యత్తులో రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా దీనిని అమలు చేస్తామని మందసుర్జిల్లా ఎక్సైజ్ఆఫీసర్ అనిల్ సచిన్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఈ ఆఫర్‌పై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇలా చేయడం వల్ల మద్యం వినియోగాన్ని మరింత ప్రోత్సహించినట్టు అవుతుందని చెబుతున్నారు.