పుట్టిన రోజు వేడుకల్లో చొక్కాలిస్తామని హ్యాండ్ ఇచ్చారు

by Anukaran |
పుట్టిన రోజు వేడుకల్లో చొక్కాలిస్తామని హ్యాండ్ ఇచ్చారు
X

దిశ, కొత్తగూడెం: చొక్కాలు ఇస్తామని పిలిస్తే పని మానుకుని పరుగున వచ్చేశారు. కొంతమందికి మాత్రమే పంచిపెట్టడంతో నిరాశతో వెనుదిరిగారు ఆటోడ్రైవర్లు. సోమవారం ఖమ్మంలో నిర్వహించిన ఎంపీ నామా నాగేశ్వర్ రావు జన్మదిన వేడుకల్లో వారికి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవ కొత్తగూడెం క్లబ్ లో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు పంపిణీ చేస్తామని చెప్పడంతో స్థానికంగా ఉన్న సుమారు 300 మంది తరలొచ్చారు.

కేక్ కట్ చేసి.. విలేకరుల సమావేశం అనంతరం పంపిణీ చేస్తామని చెప్పడంతో సుమారు రెండున్నర గంటల పాటు ఆశగా ఎదురుచూశారు. తీరా పంపిణీ చేసిన 10 నిమిషాల్లోనే చొక్కాలు అయిపోయాయని అనడంతో ఆటోడ్రైవర్లు ఆగ్రహానికి గురయ్యారు. మూడొందల మందిని పిలిచి ముప్పై చొక్కాలైనా ఇవ్వరా? అని మండిపడ్డారు. కేవలం టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘానికి మాత్రమే పంచిపెట్టి మిగతావారికి లేవనడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడు గంటల పాటు ఎదురుచూశామని, ఆటో నడిపినా రూ. 250 నుంచి రూ.300 అయినా గిట్టుబాటు అయ్యేదని ఆటో డ్రైవర్లు ఆవేదనతో వెనుదిరిగారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed